Mar 06,2023 23:45

సుబ్బారావు (ఫైల్‌ఫొటో)

యుటిఎఫ్‌ సంతాపం
ప్రజాశక్తి-రాజవొమ్మంగి

మండలంలోని వాతంగి పంచాయతీ బట్టవారివీధి గ్రామంలో జిపి స్కూల్‌లో ఉపాధ్యాయునిగా పని చేస్తున్న బీరబోయిన సుబ్బారావు (43) బ్రెయిన్‌ స్ట్రోక్‌తో సోమవారం తెల్లవారు మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం... సుబ్బారావుకు ఆదివారం రాత్రి బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చి తన ఇంటివద్ద కుప్పకూలి పడిపోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన కాకినాడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి కి తరలించారు. అక్కడ డాక్టర్లు వైద్యం అందిస్తుండగా పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందారు. సుబ్బారావు స్వగ్రామం రాజవొమ్మంగి మండలం దోనెలపాలెం. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుబ్బారావు మృతి చెందడంతో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సుబ్బారావు మృతికి యుటిఎఫ్‌ నాయకులు సంతాపం తెలిపారు.