Jan 08,2023 23:23

విద్యార్థులకు కళ్లద్దాలు తొడుగుతున్న బ్రాండిక్స్‌ ఇండియా పార్టనర్‌ దొరస్వామి

ప్రజాశక్తి-అచ్యుతాపురం
బ్రాండిక్స్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 98వ ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. 440 మంది కంటి రోజులు హాజరయ్యారు. వారిలో 410 మందికి పరీక్షలు చేశారు. పదిమంది చిన్నారులు కూడా వచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు. సాధారణ చికిత్సలతో పాటుగా 38 మందికి ఉచిత కంటి అద్దాలను బ్రాండిక్స్‌ ఇండియా పాట్నర్‌ పి దొరస్వామి చేతుల మీదుగా అందజేశారు. 120 మందికి మందులు పంపిణీ చేశారు. 19 మందికి క్యాట్రాక్ట్‌ సర్జరీ చేయాలని సిఫార్సు చేశారు. విశాఖ శంకర్‌ ఫౌండేషన్‌ వైద్యులు కంటి రోగులను పరీక్షించారు. శిబిరానికి వచ్చేసిన రోగులకు మజ్జిగ ఫలహారాలు భోజనం సదుపాయాన్ని కల్పించారు. ఈ సందర్భంగా బ్రాండిక్స్‌ ఇండియా పార్టనర్‌ దొరస్వామి వైద్య శిబిరం ఏర్పాట్లను పరిశీలించారు. శిబిరానికి తరలివచ్చిన కంటి రోగులతో మమేకమై వారితో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శిబిరం వద్ద ఏర్పాటుచేసిన సదుపాయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. ఉచిత కంటి వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.