Nov 09,2023 00:39

పల్నాడు జిల్లా: వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి పంచాయతి లోని జలాల పాలెం గ్రామ రెవిన్యూ అధికారి నాగ రాజు ప్రభుత్వ భూములు ఆక్రమణదారులకు మద్దతుగా ఉంటూ, పట్టా భూములు రికార్డులు తారుమారు చేస్తూ అక్ర మాలకు పాల్ప డుతున్నా డని, నాగరాజుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయ కులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఆర్డీఓ ఎం. శేషిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. సర్వేనెంబర్‌ 68, 86 బి, చెరువు పోరంబోకు భూమిలో నాగరాజు బంధువులు ఇళ్లు నిర్మించారని చెప్పారు.పట్టా భూముల యజమానుల కు రక్షణ కల్పించాలని ప్రభుత్వ భూములను కాపాడ లన్నారు. పిడిఎం రాష్ట్ర నాయకులు వైవి వెంకటేశ్వరరావు, పిడిఎం పల్నాడు జిల్లా అధ్యక్షులు మస్తాన్వలి, పిడిఎం నాయకులు నల్లపాటి రామారావు, జై భీమ్‌ భారత పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గోదా జాన్‌ పాల్‌, భారత బచావో పల్నాడు జిల్లా అధ్యక్షులు వి.కోటా నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.