బొప్పరాజుపల్లిలో ఉద్రిక్తత
హంతకుని ఇంటిముందు మృతదేహంతో ఆందోళన
గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ
మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్
ప్రజాశక్తి -రామచంద్రాపురం
రెండు కుటుంబాల మధ్య చిన్నపాటి వివాదం హత్యకు దారితీసింది.. దీంతో మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని, హంతకులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు హంతకుని ఇంటి ముందు మంగళవారం సాయంత్రం మృతదేహంతో నిరసన తెలిపారు. అంత్యక్రియలు బుధవారం ఉదయం జరగనుండడంతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడంతో బొప్పరాజుపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాలిలా ఉన్నాయి.
తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం, అనుపల్లి పంచాయతీ బొప్పరాజుపల్లి గ్రామంలో హంతకుడు అంబారపు సిద్దిక్ ఇంటిముందు మహమ్మద్ రఫీ మతదేహాన్ని పెట్టి గ్రామస్తులు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. గత గురువారం రాత్రి బొప్పరాజు పల్లి గ్రామంలో అంబారపు మహమ్మద్ రఫీ, అంబారపు సిద్దేక్, అంబారపు ఖాదరవల్లి కుటుంబాల మధ్య చిన్నపాటి వివాదం చెలరేగింది. దీంతో సిద్దేక్, మహమ్మద్ రఫీ తలపై కర్రతో కొట్టడంతో తలకు తీవ్ర గాయం అయ్యింది. మహమ్మద్ రఫీ స్పృహ కోల్పోయి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. స్థానికులు వైద్య చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు స్విమ్స్‌కు రెఫర్ చేయడంతో స్విమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మతి చెందారు. స్థానిక పోలీసులు హత్యాయత్నం కేసుగా కేసు నమోదు చేసి నిందితులైన అంబారపు సిద్దిక్, అంబారపు ఖాదరవల్లిలను ( ఎర్ర సాహెబ్ ) అరెస్టు చేసి ఆదివారం రిమాండ్ కు తరలించారు. కానీ హత్యకు గురైన మహమ్మద్ రఫీ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని గ్రామస్తులు భీక్ష్మించుకున్నారు. దీంతో చంద్రగిరి సీఐ రాజశేఖర్. ఆర్సిపురం ఎస్‌ఐ గిరిబాబు బొప్పరాజుపల్లి గ్రామంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ గ్రామస్తులు, మతుని బంధువులు మహమ్మద్ రఫీ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. మతుడు మహమ్మద్ రఫీ అందరివాడు, వివాద రహితుడు కావడంతో బొప్పరాజు పల్లి గ్రామం ప్రజలు శోకసముద్రంలో మునిగిపోతున్నారు. స్థానిక పోలీసులు కేసును హత్యగా మార్చినట్లు స్థానిక పోలీసులు తెలియజేశారు. ముఖ్యంగా మతుడు తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కావడంతో పాలకపక్షం, ప్రతిపక్షాలు ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాటం ఆపమని పోలీసులను హెచ్చరించారు. బుధవారం చంద్రగిరి టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్, ఎమ్మెల్యే అభ్యర్థి వారి కుటుంబ సభ్యులు ఉదయం 10 గంటలకు చేరుకుని దహన క్రియలు పూర్తి అయ్యేంతవరకు ఉండి, మహమ్మద్ రఫీ మతదేహానికి ఘన నివాళులు అర్పించనున్నారు. హంతకుడు వైఎస్‌ఆర్సిపి పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో పోలీసులు కొంతమేరకు సహాయ సహకారాలు అందిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మహమ్మద్ రఫీ హంతకులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
హంతకుని ఇంటి ముందు మృతదేహం










