Mar 30,2023 00:17

నిరసన చేపడుతున్న గిరిజనులు

ప్రజాశక్తి-మాడుగుల:బోయ/వాల్మీకిలను ఎస్టీ జాబితా లో చేర్చాలని అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని వెనక్కు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంఘం 5వ షెడ్యూల్‌ సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరట నరసింహమూర్తి డిమాండ్‌ చేశారు. బుదవారం ఎం.గదబూరులో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సదరు కులాలను ఎస్‌టి జాబితాలో చేర్చ కూడదని రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు జరిగినా ప్రభుత్వం పట్టించుకోకుండా తీర్మానం చేయడం దుర్మార్గమన్నారు. నాన్‌ షెడ్యూల్‌ ప్రాంతాన్ని షెడ్యూల్‌ ఏరియాలో చేర్చాలని ప్రజలు కోరుతున్నా పట్టించుకోని ప్రభుత్వం ఓట్ల కోసం ఇటువంటి నిర్ణయం తీసుకుందని అన్నారు. ఆర్థికంగా ఉన్నత స్థితిలో వున్న 40 లక్షల మంది బోయ,వాల్మీకిలను ఎస్‌టిలలో చేర్చడం అన్యాయమన్నారు. గిరిజన వ్యతిరేక విధానాలను వీడి జిఓ 52 ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎరయ్యమ్మ, సోమి నాయుడు, ఆదినారాయణ, భూలోకమ్మ, దేముదమ్మ పాల్గొన్నారు.