ప్రజాశక్తి - బుట్టాయగూడెం
బోయ వాల్మీకులను ఎస్‌టి జాబితాలో చేర్చొద్దంటూ ఏజెన్సీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఐటిడిఎ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి సంఘం జిల్లా కార్యదర్శి కుంజం రామారావు మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, తక్షణమే ఆ తీర్మానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సవలం రాంబాబు, దాడి రాముడు, మిడియం రవి దొర పాల్గొన్నారు.










