ప్రజాశక్తి -హుకుంపేట:మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల సర్వ సభ్య సమావేశంలో ఏర్పాటు చేశారు.అన్ని శాఖల అధికారులతో పాటు మండలం లోని 33 పంచాయతీల సంబంధించిన ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్ని పంచాయతీల్లో పలు సమస్యలు, నిధులు కోసం సమీక్షించారు.గ్రామాల్లో ఉన్న రోడ్లు, పీవీపీటీజీ లకు 35 కేజీల బియ్యం, అంత్యోదయ రేషన్ కార్డులు, ఆర్ ఓఎఫ్‌ఆర్ పోడు పట్టాల గ్రాంట్, సాగు, తాగునీరు, డ్రైనేజీ, తారు రోడ్లు మంజూరు వంటి పలు అంశాలపై సీపీఎం వైస్ ఎంపీపీ సుడిపల్లి కొండలరావు పలువురు నేతలు సమావేశంలో ప్రశ్నించారు. అనంతరం ప్రభుత్వం బోయ/వాల్మీలను ఎస్‌టి జాబితాలోకి చేరుస్తూ మార్చి 24న అసెంబ్లీలో చేసిన తీర్మానంకు వ్యతిరేకంగా సమావేశంలో వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు ప్రవేశ పెట్టిన తీర్మాణంను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించి ముక్తకంఠంతో ఖండించారు. ఎంపీపీ కూడా రాజుబాబు ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రేగం మత్స్య లింగం, ఎంపీడీఓ ఆర్ వెంకటరావు, సీడీపీఓ సిహెచ్ బాలమణి దేవి, అధికారులు, ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షుడు, భూర్జా ఎంపీటీసీ మజ్జి హరి, కొట్నాపల్లి ఎంపీటీసీ సాంబే బాలకష్ణ, సూకూరు ఎంపీటీసీ కిలగడ సింహాచలం, సంతారి ఎంపీటీసీ సభ్యులు సుశీల, బాకూరు ఎంపీటీసీ సభ్యులు నైని రజని, సర్పంచ్‌లు రేగం రమేష్, ఎస్.శాంత కుమారి, టీ ముత్యాలమ్మ, పీ.లక్ష్మీ, సోకేళి కృష్ణారావు పాల్గొన్నారు.










