జిల్లా వార్తలు
అల్లూరి సీతారామరాజు జిల్లా
బోటు ప్రమాద మృతుడు రామకృష్ణ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి
మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సత్యనారాయణ
ప్రజాశక్తి-విఆర్.పురం
పోచవరం టూరిజం బోటు పాయింట్ వద్ద కొత్త రాజాకు చెందిన బోటులో పని చేస్తూ గురువారం జరిగిన ప్రమాదంలో మృతి చెందిన భవానీ శంకర్ (22) కుటుంబానికి బోటు యజమాని నష్ట పరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ ఎంపిపి కారం లక్ష్మీ డిమాండ్ చేశారు. శుక్రవారం రేఖపల్లిలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ ప్రమాదంపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి బోటు యాజమాన్యంపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి సోయం చినబాబు, చిన్నమట్టిపల్లి ఎంపీటీసీ పూనెం ప్రదీప్ కుమార్, శ్రీరామగిరి సర్పంచ్ పులి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.










