నిర్మానుష్యంగా ఉన్న చాపరాయి
ప్రజాశక్తి-డుంబ్రిగూడ:గత మూడు రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మండలంలో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. ఆదివారం చాపరాయికు పర్యాటకులు అధికంగా రాకపోవడంతో బోసి పోయింది. దీంతో, వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు.










