బోరు ఏర్పాటు పనులను పర్యవేక్షిస్తున్న కార్పొరేటర్ హేమలత
ప్రజాశక్తి -పిఎం పాలెం : జివిఎంసి 5వ వార్డు పరిధిలోని ఎన్‌టిఆర్ హుదూద్ కాలనీలో తాగునీటి బోరు ఏర్పాటు పనులను కార్పొరేటర్ మొల్లి హేమలత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బోరు పూర్తిగా పాడవటం వల్ల ప్రజలు చాలా కాలం నుంచి తాగునీటికి ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకొని జివిఎంసి కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం లేవనెత్తినట్లు తెలిపారు. మేయర్ స్పందించి తక్షణమే ఈ సమస్య పరిష్కరించాలని ఆదేశాలు జారీచేయడంతో కొత్త బోరు మంజూరుచేశారని తెలిపారు. సమస్యను పరిష్కరించిన కార్పొరేటర్ హేమలతను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో వాటర్ సప్లరు డిఇ శ్రీహరి, ఎంఎం.నాయుడు, సతీష్, కాలనీ పెద్దలు ప్రసాద్, జోగేశ్వర పాత్రో, కొత్తల శ్రీను తదితరులు పాల్గొన్నారు.










