Jul 06,2023 01:03

మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌

ప్రజాశక్తి అద్దంకి : సంతమాగులూరు మండల పరిధిలోని పరిటాలవారిపాలెం, కుందుర్రు ,మామిళ్ళపల్లి మరియు మక్కెనవారిపాలెం గ్రామాల టిడిపి నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాటా ్లడుతూ కొత్త ఓట్లు నమోదు, తొలగింపులపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, 300 ఓట్లకు కుటుంబ సారధి, ప్రతి 60 ఓట్లకు ఓటరు పేజీ నేస్తం సభ్యులను ఎంపిక చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. వైసిపి పాలనలో విద్యుత్‌, నిత్యావసర వస్తువుల ధరలు పరిగినట్లు తెలిపారు. సంక్షేమం ఎక్కడా కానరాలేదని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టారని విమర్శించారు. టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోలోని సూపర్‌ సిక్స్‌ హామీలు అమల్లోకి వస్తే ఐదేళ్లలో సరాసరిన ప్రతి కుటుంబానికీ రూ.6 లక్షల వరకూ అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు. 18 నుంచి 59 ఏళ్ల వయసు మహిళలు కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికీ నెలకు రూ.1,500 వంతున. ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంత మంది ఉంటే అంత మందికీ ఒక్కొక్కరికి రూ.15 వేలు. ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందజేస్తారని తెలిపారు. మహిళలకు ఆర్‌టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలు టిడిపి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ పరిశీలకుడు షేక్‌ షమీమ్‌ ఖాన్‌, ఆయా గ్రామమాల టిడిపి నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.