Sep 26,2023 22:00

విద్యార్థినితో ఇంగ్లీషు చదివిస్తున్న డిఇఒ లింగేశ్వరరెడ్డి

ప్రజాశక్తి - నెల్లిమర్ల :  ఉపాద్యాయులు అభ్యాసన, బోధనలో మెరుగు పర్చుకోక పోతే తీవ్ర చర్యలు తీసుకుంటామని డిఇఒ బి. లింగేశ్వర రెడ్డి హెచ్చరించారు. మంగళవారం స్థానిక రామతీర్థం జంక్షన్‌ ఎంపిపి పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల ఆంగ్లం అభ్యాసనపై పలు ప్రశ్నలు వేశారు. అయితే విద్యార్థి సారిగా చెప్పలేకపోవడంతో డిఇఒ సంబంధిత ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొంత మంది విద్యార్థులను అడిగినా ఇదే పరిస్థితి కనిపించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ప్రభుత్వం ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా ఉపాధ్యాయులు అభ్యాసన, బోధనలలో నిర్లక్ష్యం వహించడం భావ్యం కాదని, తీరు మార్చుకోకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఇఒ యు. సూర్య నారాయణ మూర్తి, డైట్‌ ప్రిన్సిపాల్‌ ఎన్‌టి నాయుడు పాల్గొన్నారు.