Apr 20,2023 23:47

కరకుదురులో రైతులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న సిపిఎం నాయకులు


- సిపిఎం
ప్రజాశక్తి - కాకినాడ
జిల్లాలో అత్యధిక రైతులు పండించిన బొండాలు ధాన్యం కొనుగోలుకు ఆర్‌ బి కే కేంద్రాలు తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేసేలా నిబంధనలు మార్పు చేయాలని సిపిఎం జిల్లా కన్వీనర్‌ ఎం. రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా పరిషద్‌ సమావేశంలో ప్రజా ప్రతి నిధులు ఆందోళన వ్యక్తం చేసినా కొనుగోలు సంబంధించి ఆర్‌బికెలకు నిర్ధిష్ట సూచనలు చేరలేదన్నారు. గురువారం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో రైతులను వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. రైతులు ధాన్యం కోతలు, మసూళ్లు చేస్తున్నారని ప్రయివేట్‌ వ్యాపారులు ఎంత ధర చెపితే అంత ధరకు రైతు తెగనమ్ముకోవలసి వస్తోం దని కౌలు రైతులు పేపకాయల నాగేశ్వరావు, తోటకూర సత్య ఆవేదన వ్యక్తం చేశారని రాజశేఖర్‌ తెలిపారు. తక్షణమే రైతు భరోసా కేంద్రాల సిబ్బంది క్షేత్ర స్థాయిలో పాటిశీలించి బొండాలు రకం ఎంత పండించారో లెక్కలు తెల్చాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఏ. సుబ్రహ్మణ్యం, పి. శ్రీనివాస్‌ పాల్గొన్నారు.