
విస్సాకోడేరు సర్పంచి సేవలు అమోఘం : డిసిసిబి ఛైర్మన్ పివిఎల్
నా మిత్రుడుకి అవార్డు రావడం ఆనందదాయకం : ఎంపిపి చంటిరాజు
ప్రజాశక్తి - పాలకోడేరు
రాజీవ్ గాంధీ నేషనల్ మెమోరియల్ అవార్డు అందుకున్న విస్సాకోడేరు సర్పంచి, సర్పంచుల ఛాంబర్ మండల ప్రధాన కార్యదర్శి బొల్ల శ్రీనివాస్‌కు అభినందనలు వెల్లువలా కూరిశాయి. రాజకీయ పార్టీలకు అతీతంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, అధికారులు, ఎంపిటిసి సభ్యులు, సర్పంచులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు అవార్డు గ్రహీత శ్రీనివాస్‌ను అభినందించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి భూపతిరాజు సత్యనారాయణ రాజు (చంటిరాజు) ఆధ్వర్యంలో అవార్డు గ్రహీత బొల్ల శ్రీనివాస్‌కు అభినందన సత్కార కార్యక్రమాన్ని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపిడిఒ మురళిగంగాధరరావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా డిసిసిబి ఛైర్మన్, వైసిపి ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పివిఎల్.నరసింహరాజు హాజరై మాట్లాడారు. సర్పంచిగా బొల శ్రీనివాస్ విస్సాకోడేరు గ్రామానికి అందిస్తున్న సేవలు అమోఘమన్నారు. మెయిన్ సెంటర్‌లో అన్ని హంగులతో సచివాలయ భవనాన్ని ఎంతో అందంగా నిర్మించారని చెప్పారు. పారిశుధ్య మెరుగుదలకు డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి అధునాతన పద్ధతిలో చెత్త సేకరణ చేస్తున్నారన్నారు. గ్రామానికి అందిస్తున్న సేవలకు గుర్తుగా జాతీయస్థాయిలో అవార్డు రావడం అభినందనీయమన్నారు. మిగిలిన సర్పంచులు బొల్ల శ్రీనివాస్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఎంపిపి చంటిరాజు మాట్లాడుతూ నా మిత్రుడు బొల్ల శ్రీనివాస్‌కు జాతీయస్థాయి అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దేశంలోనే ఈ జాతీయ అవార్డుకు ఐదుగురు ఎంపిక కాగా రాష్ట్రం నుంచి మిత్రుడు శ్రీనివాస్‌కు రావడం గర్వంగా ఉందన్నారు. గొరగనముడి మాజీ సర్పంచి చెల్లబోయిన పాపారావు మాట్లాడుతూ ఎస్‌సి, బిసి సర్పంచులకు కొన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయని, వాటిని అధిగమించి తన సోదరుడు బొల్ల శ్రీనివాస్ విస్సాకోడేరు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఉప ఎంపిపి ఆదాడ లక్ష్మీతులసి మాట్లాడుతూ దేశంలోనే పాలకోడేరు మండలానికి అవార్డు రావడనికి కృషి చేసిన సర్పంచి శ్రీనివాస్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. అనంతరం అవార్డు గ్రహీత బొల్ల శ్రీనివాస్‌ను డిసిసిబి ఛైర్మన్ పివిఎల్, ఎంపిపి చంటిరాజు ఘనంగా సత్కరించారు. విస్సాకోడేరు గ్రామస్తులు, అభిమానులు, ఎంపిటిసి సభ్యులు, సర్పంచులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, స్నేహితులు శ్రీనివాస్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఛాంబర్ మండల అధ్యక్షులు భూపతి రాజు వంశీకృష్ణమరాజు, వైసిపి ముఖ్య నేతలు కొత్తపల్లి కాశి విశ్వనాథరాజు, చేకూరి రాజా నరేంద్ర కుమార్, సహదేవరాజు, కోళ్లఫారం శ్రీనివాస్‌రాజు, పెన్నాడ గోపాలకృష్ణంరాజు, సర్పంచులు జంగం సూరిబాబు, కడలి నాగేశ్వరి, ఇంజేటి మరియమ్మ, కడలి విజయలక్ష్మి, ఎంపిటిసి సభ్యులు బొల్లం గాంధీ, పాల జ్యోతి, నాగలక్ష్మి, స్వాతి, వెంకటలక్ష్మి, శాంతి కుమారి, మల్లుల సూర్యకళ, షేక్ పాప సాహెబ్, పెదపూడి లక్ష్మీపతి, నాయకులు చేయబోలు బాలాజీ, పాల రాధాకృష్ణ, రిచి జాన్‌కిడ్స్, ఉండ్రు శ్రీను, ప్రసాద్ పాల్గొన్నారు.
అవార్డు నా ఒక్కడి సొంతం కాదు
అవార్డు గ్రహీత బొల్ల శ్రీనివాస్
తనపై ఆదరభిమానాలు ప్రేమ ఆప్యాయతలు కురిపిస్తున్న ప్రతి ఒక్కరికి రుణ పడి ఉన్నానని అవార్డు గ్రహీత, సర్పంచి బొల్ల శ్రీనివాస్ అన్నారు. జాతీయ స్థాయి అవా ర్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ అవార్డు నా ఒక్కడి సొంతం కాద ని, అందరిదని చెప్పారు. అవార్డు అందుకోవ డానికి గ్రామాన్ని అభి వృద్ధి చే యడానికి పార్టీలకు అతీ తంగా గ్రామస్తు లంతా సహాయ సహ కారాలు అందించారన్నారు. ముఖ్యంగా కలెక్టర్ ప్రశాంతి, ఎడ్వర్డ్ పలు సూచనలు సలహాలు అందించారని తెలిపారు.