ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం మండలంలోని అయ్యంబొట్లపల్లి గ్రామ సమీపంలో గల బొగ్గుల బట్టిలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రూ.20 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. అయ్యంబొట్లపల్లి గ్రామానికి చెందిన ఉమ్మనేని వేణు అనే వ్యాపారి అయ్యంబొట్లపల్లి గ్రామ సమీపంలో బొగ్గుల బట్టిని నిర్వహిస్తున్నారు. ఆదివారం కట్టెలతో బొగ్గులు తయారు చేస్తుండగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న కర్రతో పాటు వినియోగా నికి సిద్ధంగా ఉన్న బొగ్గులు కాలి బూడిద అయ్యాయి. ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలను ఆర్పేందుకు అక్కడి కార్మికులతో పాటు అయ్యంబొట్లపల్లి గ్రామస్థులు ప్రయత్నిం చినా ఉపయోగం లేకుండాపోయింది. యర్రగొండపాలెం నుంచి అగ్నిమాపక దళ వాహనం వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసే లోపే బొగ్గులన్నీ కాలి బూడిదైపోయాయి. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బొగ్గుల బట్టి యజమాని ఉమ్మనేని వేణు కోరారు.










