
బొగ్గు లైన్ వాసులకు సురక్షిత ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వండి..
ఎంపీ, ఎమ్మెల్యే ఆస్తుల విలువ పెంచుకునేందుకే బొగ్గు లైన్ వాసులను ఖాళీ చేయిస్తున్నారు.
అధికారిక కార్యక్రమాలు ఎమ్మెల్యే ఇంటి వద్ద పెడితే లీగల్ నోటీసులు అందుకుంటారు...
నంద్యాల అభివృద్ధి పై చర్చకు సిద్ధం... ఎప్పుడు వస్తావో చెప్పు..
ఎమ్మెల్యేకు భూమా అఖిల ప్రియ ప్రతి సవాల్..
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
ఎంపీ, ఎమ్మెల్యే స్థలాలు ఉన్నాయి.. వాటి విలువను పెంచుకునేందుకే ఆగమేఘాలపైన బొగ్గు లైన్ వాసులను అక్కడ నుండి ఇళ్లను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకురాలు,మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఘాటు వాఖ్యలు చేశారు. బాధితులు ఉండటానికి వీలు లేని ప్రాంతంలో కుందూ నది పరివాహక ప్రాంతంలో ఇళ్లు ఇవ్వడం దూర్మార్గమన్నారు.ఆదివారం నంద్యాల పట్టణంలోని తన కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో భూమా అఖిల ప్రియ మాట్లాడుతూ ఎమ్మెల్యే శిల్పా రవి బొగ్గు లైన్ ప్రజలను మోసం చేస్తున్నాడని చెప్పారు. బొగ్గు లైన్ ప్రజలకు హైకోర్టులో న్యాయం జరిగిందన్నారు. అక్కడి ప్రజల ఇళ్లను కూల్చకూడదని, వారిని ఖాళీ చేయించ కూడదని హై కోర్టు స్టే ఇచ్చిందని కోర్టు స్టే ఇవ్వడం పట్ల ఆమె హర్షం ప్రకటిస్తూ, స్టే తెచ్చిన సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసి రెడ్డిని ఆమె అభినందించారు. కేవలం ఎంపీ, ఎమ్మెల్యే ఆస్తులకు విలువ పెంచుకోవడం కోసమే బొగ్గు లైన్ నివాసితులను బలి చేస్తున్నారని ఆమె విమర్శించారు. ఎలాంటి రక్షణ లేని కుందూ నది పక్కన ఇళ్ల స్థలాలు ఇవ్వడం తగదన్నారు. అక్కడ ఇళ్లు కట్టుమునే పరిస్థితి ఉందా... ముందు నివ్వు అక్కడ ఇళ్లు కట్టుకొని ఉండగలవా...బుద్ది ఉన్న వాళ్లు ఎవ్వరైనా వరదలు వచ్చే ప్రాంతం కుందూ పక్కన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం బాధాకరమన్నారు.మీ తండ్రి ఎమ్మెల్యే హయాంలో కుందూ వెడల్పు కు రైతుల నుండి తక్కువ రేటు కు కొనుగులు చేసిన భూములు అవి అని అయిన కుందూ నది వెడల్పు చేయలేకపోయారన్నారు.100 కోట్లు ప్రొటాక్షన్ వాల్ కోసం వచ్చిన 100 కోట్లు నిధులు వీళ్ల చేతగాని తనం వల్ల వెనక్కు వెళ్ళాయని ఆమె ఆరోపించారు.గుడిసెల్లో ఉన్న వాళ్ళను లేపి మళ్ళీ గుడిసెలను కేటాయించడం సిగ్గు చేటన్నారు. కనీసం ఇళ్లు కట్టించే శక్తి ఈ ప్రభుత్వానికి లేదా అని ఆమె ప్రశ్నించారు.వీళ్ల ఆలోచనలు పిచ్చోళ్ళు ల ఉన్నాయన్నారు. ప్రజలు కు సేవా చేస్తున్నామని చెప్పుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆమె శిల్పా రవి పై మండిపడ్డారు. నంద్యాల అభివృద్ధి పైన చర్చ కు రమ్మని సవాల్ విసురుతూన్న నీకు చెబుతున్న ఎవరిని ఎంచుకుంటావో తేల్చుకో వస్తాం అంటూ భూమా అఖిల ప్రియ శిల్పా రవికి ప్రతి సవాల్ విసిరారు.రైతుల సబ్సిడీ విత్తనాలు లు ను నీ ఇంటి నుండి పంచుతావా.. ఆర్ బీ కె లకు వెళ్లి పంపిణీ చేసే సమయం లేదా..అధికారులు ఎవ్వరైనా ప్రభుత్వ కార్యక్రమం లు పెడితే లీగల్ గా నోటీసులు అందుకోవలసి వస్తుందన్నారు. ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి అక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. టిడ్కోఇళ్లు కట్టించింది మా ప్రభుత్వం లో మీరు ఏమి చేశారు నంద్యాలకనీ ప్రశ్నించారు.సొంత నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొనే ఎమ్మెల్యే నీ ప్లాంట్ మున్సిపల్ స్థలం, నీ ప్లాంటు కు కరెంటు చార్జీలు కట్టేది మున్సిపాలిటీ, చివరకు నీవు తిరిగే వాహనానికి డిజల్, పెట్రోల్ కూడా మున్సిపల్ నిధులనే వాడే దౌర్బాగ్య పరిస్థితి లో ఎమ్మెల్యే ఉన్నడని ఆమె ఆరోపించారు.కుందూ పక్కన స్థలం కేటాయించడం సరైంది కాదన్నారు.సురక్షిత ప్రాంతంలో భూసేకరణ చేపట్టాలని అప్పుడే వారిని అక్కడ నుండి ఖాళీ చేయించాలని భూమా అఖిల ప్రియ డిమాండ్ చేశారు.బలవంతంగా ఖాళీ చేయించాలని అధికారులు చూస్తే వారిపై లీగల్ గా నోటీసులు అందుకోవలసి వస్తుందని ఆమె హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ న్యాయవాది తాతి రెడ్డి తులసి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.