Mar 17,2023 22:53

ప్రజాశక్తి - వన్‌టౌన్‌ : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ కొత్తూరు, తాడేపల్లికి చెందిన భీమవరపు సామిరెడ్డి, కుటుంబ సభ్యులు శ్రీ అమ్మవారి అలంకారం నిమిత్తం 52 గ్రాములు బరువు గల బంగారు లక్ష్మీ కాసుల హారం అలాగే జె.వి.డి.వి ప్రసాద్‌ రెడ్డి, తాడేపల్లి వారు 25 గ్రాములు బరువు గల బంగారు కాసుల నెక్లెస్‌ను శుక్రవారం ఆలయ కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబని కలిసి దేవస్థానానికి విరాళంగా అందజేశారు. ఆలయ అధికారులు దాత కుటుంబానికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించగా, వేదపండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్‌ బోర్డు సభ్యులు బుద్దా రాంబాబు పాల్గొన్నారు.