Sep 27,2023 16:17

మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో. రవీంద్రారెడ్డి

బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి - ఐటీడీఏ పీవో రవీంద్రారెడ్డి
ప్రజాశక్తి. శ్రీశైలం ప్రాజెక్టు

      శ్రీశైలం ఐ టి డి ఏ పరిధిలో సుండి పెంట లోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల (బాలురు) స్థానిక ఐటీడీఏ పీవో బి. రవీంద్రారెడ్డి సందర్శించి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఈ సందర్భంగా  విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని విద్యార్థులు రాష్ట్రానికి కాక దేశానికి కూడా భావితరాలకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా క్రమశిక్షణతో మెలగాలన్నారు. దేశం కోసం అల్లూరి సీతారామరాజు, సర్దార్ వల్లభాయ్ పటేల్, వివేకానంధుని అడుగుజాడల్లో నడిచి ఇటు పాఠశాలకు, అటు తల్లిదండ్రులకు ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అన్నారు.ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని చదువుతోపాటు క్రీడలతో కూడా మంచి నైపుణ్యాన్ని పెంచుకోవాలని విద్యార్థులకు హిత వు పలికారు. పాఠశాలలో  వారం క్రితం జరిగిన నలుగురు విద్యార్థులు పాఠశాలలో లేరనే విషయము ఆలస్యంగా తెలిసినదని ఈ విషయంపై సంబంధిత ప్రిన్సిపాల్కు మెమో జారీ చేయడం జరిగిందన్నారు. ఎట్టకేలకు పారిపోయిన విద్యార్థులు గుంటూరులో ఉన్నట్లు సమాచారం వచ్చినదని వారు పాఠశాలకు తిరుగు ప్రయాణం అయినట్లు ఆయన వివరించారు. ఇలాంటి సంఘటన మరల పునరావృతం కాకుండా చూస్తామని వివరించారు.ఇప్పటినుండి ఎప్పటికప్పుడు పాఠశాలను మానిటరింగ్ చేస్తూ విద్యార్థులను క్రమశిక్షణ తొ మెలగాలని   ఉపాధ్యాయులకు, విద్యార్థులకు తగిన సూచనలు ఇచ్చారు.