కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే బీవీ
ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
పట్టణానికి చెందిన నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షులు దేవమ్మ భర్త బంగారప్ప ఇటీవల గుండెపోటుకు గురై మృతి చెందారు. ఆయన మృతికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ.జయనాగేశ్వర్ రెడ్డి నివాళులర్పించారు. మంగళవారం పట్టణంలోని 34వ వార్డులో గల వారి స్వగృహానికి వెళ్లి బంగారప్ప చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేవమ్మను ఓదార్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. టిడిపి తరపున అండగా ఉంటామని తెలిపారు.










