
ఉమ్మడి జిల్లాల్లో టిడిపి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బంద్ విజయవంతమైంది. టిడిపి అధినేత చంద్రబాబు స్కిల్ స్కామ్‌లో అరెస్టు, రిమాండ్ పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష టిడిపి రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. పోలీసులు టిడిపి నేతల హౌస్ అరెస్టులు, నిర్బంధాలు, వాగ్వివాదాలు, తోపులాటల మధ్య బంద్ సాగిపోయింది. కడప, అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా టిడిపి నాయకులను, కార్యకర్తలను పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. జిల్లా పోలీస్ యంత్రాంగం బంద్‌ను విఫలం చేయడానికి ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ టిడిపి శ్రేణుల కార్యకలాపాల ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఫలితంగా జిల్లాల్లో ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల మూసివేత దగ్గర నుంచి ప్రజల రాకపోకలు, వారి కార్యకలాపాలు పరిమితంగా సాగిపోవడం స్పష్టంగా కనిపించింది. ప్రభుత్వం బంద్‌పై ఉక్కుపాదం మోపినప్పటికీ విజయవంతం కావడం గమనార్హం. మాజీ ఎమ్మెల్సీలు బి.టెక్ రవి, పుత్తా నరసింహారెడ్డిలను హౌస్ అరెస్టు చేశారు.. ప్రొద్దుటూరు, బద్వేల్ టిడిపి నేతలపై నిర్భందాన్ని ప్రయోగించింది. ప్రొద్దుటూరు సీనియర్ టిడిపి నాయకులు వరదరాజులరెడ్డితో పోలీసుల వాగ్వివాదాలు, తోపులాట మధ్య తీవ్ర అస్వస్తతకు గురికావడం, ఆస్పత్రికి తరలించడం, బద్వేల్‌లో యువ నాయకుడు రితేష్‌రెడ్డితో పోలీసుల వాగ్వావాదం మధ్య ఉద్రిక్తభరిత వాతావరణం నెలకొంది. కడప నియోజకవర్గ టిడిపి నేతలు అమీర్‌బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్‌లను ఆర్టీసీ రాకపోకలను నిలువరించే ప్రయత్నంలో పోలీసులు అరెస్టు చేశారు. ప్రొద్దుటూరులో కడప పార్లమెంట్ అధ్యక్షులు లింగారెడ్డి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రవీన్ కుమార్‌రెడ్డి సహా రాజంపేట, రాయచోటి ప్రాంతాల్లో టిడిపి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కడప, రాజంపేట, రైల్వేకోడూరు, బద్వేల్, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, రాయచోటి నియోజకవర్గాల పరిధిలోని ఆయా మండలాల్లో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, టైర్ల కాల్చివేత ఘటనల నేపథ్యంలో టిడిపి నాయకులను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా పోలీసుల నిఘా నీడన పరిమితంగా ఆర్టీసీ, వ్యాపార, వాణిజ్య, ప్రభుత్వ కార్యకలాపాలు సాగిపోవడం గమనార్హం. ఏదేమైనా టిడిపి తలపెట్టిన బంద్ ప్రభావం ప్రజలపై గణనీయమైన ప్రభావాన్ని చూపించిందని చెప్పవచ్చనడంలో సందేహం లేదని చెప్పవచ్చు.
కడప అర్బన్ : టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా కడపలో ఆ పార్టీ శ్రేణులు బంద్ నిర్వాహించాయి. బంద్‌ను పోలీసులు భగం చేస్తూ నాయకులను అరెస్టు చేశారు. టిడిపి కడప నియోజకవర్గ ఇన్‌ఛార్జీ ఆర్.మాధవి, నగర మహిళా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సునీత, పార్వతి, టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శులు హరిప్రసాద్, గోవర్థన్‌రెడ్డి, నగర అధ్యక్షులు శివకొండారెడ్డి, నాయకులు సుబ్బరాయుడు, పీరయ్య, గుర్రప్ప, శ్రీను, రామప్రసాద్, జియావుద్దీన్, భరత్, జిలానీబాష, శివారెడ్డి, ఎం.పి.సురేష్, పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. సింహాద్రిపురం : టిడపి రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నాయకులు బంద్ ప్రశాంతంగా నిర్వహించారు. సోమవారం టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని స్థానిక పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఉదయాన్నే పోలీసులు సింహాద్రిపురంలోని బీటెక్ రవి స్వగహానికి వెళ్లి బయటికి వెళ్లకుండా గృహ నిర్బంధం చేశారు. ముద్దనూరు : స్థానిక పాత బస్టాండ్ కూడలి నుంచి నాలుగు రోడ్ల వరకు ర్యాలీ చేశారు. మండల కేంద్రంలోని వ్యాపార దుకాణాలు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూయించారు. బస్సులను అడ్డుకున్నారు. వేంపల్లె : బంద్ చేసేందుకు సిద్దమైన టిడిపి నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దుకాణదారులు స్వచ్చంధంగా దుకాణాలు మూసివేశారు. దీంతో సిఐ గొవిందు రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ తిరుపాల్ నాయక్ తన సిబ్బందితో టిడిపి నాయకులైన మండల కన్వీనర్ రామమునిరెడ్డి, టిడిపి ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహమ్మద్ షబ్బీర్, మైనార్టీ మండల కన్వీనర్ తెలంగాణ వలి, పివి రమణ, మహమ్మద్ ఇనాయతుల్లా, డొక్క రమేష్, వేమా నారాయణ, మల్లికార్జునతో పాటు పలువురిని అదుపులో తీసుకొని వాహనంలో పోలీసు స్టేషన్ తరలించారు. మైదుకూరు (చాపాడు) : మైదుకూరులో టిడిపి ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఉదయం 6 గంటలకు ప్రోద్దుటూరు రోడ్డు నుంచి నిరసన తెలియజేస్తూ దుకాణాలు మూయిస్తూ నాలగు రోడ్ల కూడలికి చేరుకున్నారు. అంతలోనే సిఐ చలపతి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. టిడిపి నాయకులను స్టేషన్ కు తరలించారు. దీంతో దుకాణాలు పూర్తి గా తెరుచుకున్నాయి. పులివెందుల రూరల్ : చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ పులివెందులలో టిడిపి నాయకులు సోమవారం బంద్ నిర్వహించారు. పులివెందుల టిడిపి నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తుగుట్ల మధుసూదన్ రెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి, మహబూబ్ బాషా తదితరుల ఆధ్వర్యంలో ఆర్‌టిసిగ్యారేజ్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేప ట్టారు. ఆర్టీసీ బస్సులను డిపో నుంచి బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎస్‌ఐ హుస్సేన్, సత్యనారాయణ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్): మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి ఆధ్వర్యంలో శివాలయం సెంటర్లో బంద్ చేపట్టారు. పోలీసులు రంగప్రవేశం చేసి 144 సెక్షన్ అమల్లో ఉందని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టిడిపి నాయకులు పోలీసుల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనంతరం హుటాహుటిన పట్టణం గాంధీ రోడ్డులో ఉన్న కెవిఆర్ ఆస్పత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, టిడిపి ఇన్‌ఛార్జి డాక్టర్ జి .వి ప్రవీణ్ కుమా ర్‌రెడ్డి, టిడిపి రాష్ట్ర నాయకులు సి.ఎం సురేష్ నాయుడు, ముక్తియర్, నల్లబోతుల నాగరాజును అరెస్టు చేసి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలి ంచారు. వల్లూరు : మండల పరిధిలోని మాజిరెడ్డిపల్లిలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, కమలాపురం నియోజవర్గ ఇన్‌ఛార్జి పుత్తా నరసింహారెడ్డిని పలీసులు అరెస్టుచేశారు. టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు అక్రమ అరెస్టు నేపథ్యంలో వల్లూరు, కమలాపురంలో శాంతియుత ర్యాలీ నిర్వహించేందుకు టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పిలుపునిచ్చారు. వల్లూరులో శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న టిడిపి మండల అధ్యక్షుడు లేబాక నాగేశ్వరరెడ్డిని , టిడిపి నాయకులను కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జమ్మలమడుగు రూరల్ : పట్టణంలో బంద్ పాక్షికంగా జరిగింది. బంద్ కేవలం పాఠశాలలు, కళాశాలలకు, కొన్ని దుకాణాలకే పరిమితం అయింది. సోమవారం ఉదయం తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు జమ్మలమడుగు పార్టీ ఇన్‌ఛార్జి చదిపిరాళ్ళ భూపేష్ సుబ్బ రామిరెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఉదయం నుంచే ఆర్టీసీ బస్టాండ్, ప్రతి వీధిలో తన కార్యకర్తలతో భూపేష్ తిరిగి బంద్ కు సహకరించాలని కోరారు. ఆమేరకు కొంతమంది స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. టిఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో.. కడప పార్లమెంట్ అధ్యక్షుడు గొరిగెనూరు సుధీర్ రెడ్డి కడప జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ఒంటిమిట్ట : మండల కేంద్రంలో తెలుగు తమ్ముళ్లు బంద్‌ను నిర్వహించేందుకు రోడ్డుపైకి రాగానే సిఐ పురుషోత్తం రాజు, ఎస్‌ఐ మధుసూదన్ రావు వారిని అదుపులోకి తీసుకొని ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలీసుల కష్టడిలో ఉంచారు మూడు గంటలు అనంతరం వారిని పోలీసు వారు విడుదల చేశారు అరెస్ట్ అయిన వారిలో పార్టీ అధ్యక్షులు నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు, నియోజవర్గం స్థాయి నాయకులు వెంకటరమణ, అడ్వకేట్ రామదాసు, రమణ, ఈశ్వరయ్య, మండల ఉపాధ్యక్షులు మౌలాలి కిరణ్‌స్వామి, ఆంజనేయులురెడ్డి, రాంప్రసాద్, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు ఎర్రగుంట్ల : పట్టణంలో టిడిపి నాయకులు ఉదయాన్నే రోడ్లపై చేరి బంద్‌లో భాగంగా దుకాణాలను మూసివేయించారు. పట్టణంలోని పాఠశాలలు, కళా శాలలు కూడా బందులో భాగంగా సెలవు ప్రకటించాయి.
పీలేరు : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ చేపట్టిన బంద్ సందర్భంగా నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి నిర్బంధంలో ఉంచారు. బంద్‌ను నిర్వీర్యం చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఆర్‌టిసి అధికారులు పోలీసుల సూచనల మేరకు అవసరం, అవకాశాలను బట్టి బస్సులను నడుపుతున్నారు. బస్సులు ఖాళీగానే వెళ్లాయి. టిడిపి నాయకులు నిరసన చేస్తుండగా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషనుకు తరలించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి లక్ష్మీకర, కొత్తపల్లి శ్రీనాధ్ రెడ్డి, పోలిశెట్టి సురేంద్ర, దేవిరెడ్డి వెంకటరమణారెడ్డి, ఫైరోజ్, నగరిమడుగు సుభాష్, మిట్టమీద శివ, రెడ్డిముని, రహంతుల్లా, సోనీ బాషా, కొత్తపల్లి హేమంత్, సందీప్, నాగేంద్ర, ఫైరోజ్ 2, ఖాదర్, శ్రీకాంత్, అబీద్ అలీ, శ్రీనివాసులు ఉన్నారు. రాజంపేట అర్బన్ : పట్టణంలో అవాంఛనీయ ఘటనలు లేకుండా బంద్ ప్రశాంతంగా ముగిసింది. ప్రయివేటు పాఠశాలలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలను టిడిపి నేతలు మూసి వేయించారు. టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు వర్గీయలు జాతీయ రహదారిలో నిరసన తెలుపుతుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. టిడిపి సీనియర్ నాయకులు చమర్తి జగన్మోహన్‌రాజు ఆధ్వర్యంలో ఆర్.ఎస్.రోడ్డులో ధర్నా నిర్వహించారు. ప్రధాన రహదారిపై బైఠాయించి నినాదాలు చేయడంతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. జగన్మోహన్‌రాజుతో పాటు మరికొందరు నాయకులను అదుపులోకి తీసుకొని పట్టణ స్టేషన్‌కు తరలించారు. న్యాయవాదుల నిరసన : బార్ అసోసియేషన్ వద్ద రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు తరిగోపుల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు కృష్ణకుమార్, వెలగచర్ల వెంకట సుబ్బయ్య, కందుల వెంకట రమణ, మన్నేరు వెంకట సుబ్బయ్య, జల్లి నారాయణ, బసినేని రమేష్, కత్తి సుబ్బారాయుడు, వెంకటేశ్వర్లు, రెడ్డి శివ, మల్లికార్జున, నాగేశ్వర్, కోటేశ్వర, మోహన్, యు.వి.రమణ, నాగేంద్ర, గిరీష్ కుమార్, సూర్య ప్రకాష్, కోటేశ్వర్ రావు, అక్షరు కుమార్, రాజా రెడ్డి, టి.సూర్య చైతన్య, ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. రామపురం : పలువురు టిడిపి నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్లు చేశారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్‌రెడ్డి, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు గడికోట భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపిటిసి రవికుమార్‌రెడ్డి, అయోధ్యపురం ప్రతాపరెడ్డిలను అరెస్టు చేశారు. కలకడ: మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులను హౌస్ అరెస్టు చేశారు. మండల కేంద్రమైన కలకడలోని మైనార్టీ కలకడ బాధ్యులు ఎల్లమంద జీలాని బాషను హౌస్ అరెస్ట్ చేసి స్టేషన్‌లో ఉంచారు. రైల్వేకోడూరు :పట్టణంలోని టిడిపి కార్యాలయం వద్ద నుంచి ఆ పార్టీ ఇన్‌ఛార్జి కస్తూరి విశ్వనాథ నాయుడు, ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, వామపక్ష నాయకులు చేపట్టిన ర్యాలీ నిర్వహించి టోల్గేట్ సెంటర్ వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేశారు ర్యాలీని పోలీసులు బలవంతంగా అడ్డుకొని వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు ర్యాలీలో టిడిపి నాయకులు వెంకటేశ్వరరాజు, చంద్ర, అనిత దీప్తి, కస్తూరి కోటేశ్వరరావు, జయప్రకాష్, కొమ్మ శివ, నీలకంఠయ్య, పోకలమని, మధుసూదన్, మౌలా, చంద్రరాజు పాల్గొన్నారు. మదనపల్లె అర్బన్: పట్టణంలోని నిమ్మనపల్లి సర్కిల్‌లో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో రోడ్డు మీద బైటయించి నిరసన తెలిపి బంద్‌కు మద్దతు ఇచ్చారు. జనసేన నాయకులను కార్యకర్తలను అరెస్టు చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాయచోటి : టిటిడి మాజీ బోర్డు మెంబర్ సుగువాసి ప్రసాద్ బాబు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి గాజులు ఖాదర్ బాషా, మండల అధ్యక్షులు మురికినాటి వెంకటసుబ్బారెడ్డి పోలీసుల హౌస్ అరెస్టు చేశారు. టిడిపి పట్టణ అధ్యక్షులు ఖాదరవల్లి ఆధ్వర్యంలో బంగ్లా సర్కిల్ వద్ద నిరసన తెలుపుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి మండపల్లి లక్ష్మి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. చిట్వేలి: పట్టణంలోని టిడిపి మండలం అధ్యక్షులు కెకె.చౌదరి, గుత్తి నరసింహ, మాదాసు నరసింహ, కాకర్ల నాగార్జున ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా నిర్వహించారు. వ్యాపార సంస్థలు, ప్రైవేటు విద్యా సంస్థలు బంద్‌కు మద్దతుగా మూసివేశారు. కార్యక్రమంలో కాకర్ల సుబ్బరాయుడు, ఏదోటి రాజశేఖర్, న్యాయవాది బాలాజీ, బాలకృష్ణ యాదవ్, శివ ప్రసాద్ రాజు, జయ ప్రకాష్,నాగరాజు, తమ్మిశెట్టి శ్రీనివాసులు, వెంకటేష్ రాజు, నాగయ్య యాదవ్, రాయపు చంద్రమౌళి, యానాది రాజు, అనంత యాదవ్ పాల్గొన్నారు. లక్కిరెడ్డిపల్లి : మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టు దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాలాడి ప్రభాకర్ రెడ్డి సర్పంచ్ చెంద్రయుడు , దిలీప్ రాజు , సిద్దక వెంకట్రామిరెడ్డి, బడుగు వాసుదేవుడు, రవి రెడ్డి, మన్సూర్, వీరబల్లి వెంకటరమణ, తెదేపా నాయకులు అన్వర్ పాల్గొన్నారు.