Oct 03,2023 20:07

అవగాహన కల్పిస్తున్న అధికారులు

ప్రజాశక్తి - చిప్పగిరి
గర్భిణులు, బాలింతలు రక్తహీనత నివారణకు తప్పనిసరిగా బలవర్థకమైన ఆహారం తీసుకోవాలని తహశీల్దార్‌ లక్ష్మీనారాయణ, ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ ప్రసూన సూచించారు. మంగళవారం నగరడోన గ్రామంలో ప్రసూన ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, న్యూట్రిషన్‌, గ్రోత్‌ మానిటరింగ్‌పై మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వైద్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. బాల్య వివాహాలను ప్రోత్సహించకూడదని తెలిపారు. అంగన్వాడీల ద్వారా ఇస్తున్న బలవర్థకమైన ఆహారాన్ని గర్భిణులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.