బల్క్‌మిల్క్ కూలింగ్ యూనిట్ నిర్మాణాలకు చర్యలు - జాయింట్ కలెక్టర్
ప్రజాశక్తి-విజయవాడ
జిల్లాలో బల్క్‌మిల్క్ కూలింగ్ యూనిట్ (బియంసియు),ఆటోమెటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్ (ఎయంసియు) నిర్మాణాలకు అవసరమైన భూముల కేటాయింపు పూర్తి చేశామని, నిర్మాణాలను త్వరితగతిన చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజరు , ఏపి డైరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ పెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపి అమూల్ ప్రోజెక్టు స్పెషల్ ఆఫీసర్ బాబు ఏకు వివరించారు. ఏపిడిడిసిఎఫ్‌యం డైరెక్టర్ బాబు ఏ, మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్నలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో గురువారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్ నుండి జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజరులు వీడియెకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజరు మాట్లాడుతూ జిల్లాలో 112 బల్క్‌మిల్క్ కూలింగ్ యూనిట్(బియంసియు)కు పూర్తి స్థాయిలో భూములు కేటాయింపు చేశామని, అదేవిధంగా 262 ఎయంసియులకు గాను 256 కేంద్రాలకు భూ కేటాయింపు పూర్తి చేశామన్నారు. మర్టిపర్పస్ ఫెసిలిటీ సెంటర్స్ గౌడౌన్స్ నిర్మాణాలకు సంబంధించి మూడవ దశ పనులకు భూ సేకరణ వేగవంతం చేస్తున్నామని వీటిలో 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 21 గౌడౌన్‌ల నిర్మాణాలకు గాను 8 గౌడౌన్‌లకు భూముల కేటాయింపు పూర్తి చేశామని జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజరు తెలిపారు.










