Dec 19,2022 22:22

మాట్లాడుతున్న బడుగు బలహీన వర్గాల అభివద్ధి సంక్షేమ బోర్డు జాతీయ సభ్యులు

బలహీన వర్గాల ఉన్నతితోనే దేశాభివృద్ధి
బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమ బోర్డు జాతీయ కమిటీ సభ్యులు
ప్రజాశక్తి-తిరుపతి టౌన్‌:
బడుగు, బలహీనవర్గాల అభివద్ధే దేశ అభివద్ధి సాధ్యమని బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమ బోర్డు జాతీయ కమిటీ సభ్యులు తుర్క నరసింహ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో డీఆర్‌వో శ్రీనివాసరావుతో కలసి విద్య, వైద్య, పోలీసు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, స్త్రీ, శిశుసంక్షేమ, గనులు.. భూగర్భ, సంక్షేమ శాఖలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాల అభివద్ధి, సంక్షేమానికి అమలు పరచే సంక్షేమ పథకాలపై నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలతో ఆర్థికంగా అభివద్ధి చేయాలన్నదే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కమిటీ సభ్యులు జిల్లాల పర్యటనలో భాగంగా జిల్లాలోని బడుగు బలహీన వర్గాలకు కేంద్ర ప్రభుత్వం ఆమలు పరిచే సంక్షేమ పథకాలు వారికి సకాలంలో అందుతున్నాయా లేదా అని పరిశీలించడం, అధికారులతో సమావేశాలు నిర్వహించి సంక్షేమ పథకాలకు అర్హులైన వారందరికీ అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆమలు పరిచే సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రభుత్వ కార్యాలయాలలో డిస్ప్లే చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు పరిచే సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం బాగా ఉపయోగించు కుంటోందని.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, రాష్ట్రంలో ఇంగ్లీష్‌ మీడియంతో పాటు సీబీసీఎస్‌ఈ సిలబస్‌తో పాఠశాలలో బోధిస్తున్నారని తెలిపారు. ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు సైన్స్‌, ఫిజిక్స్‌, గణితంపై దష్టి సారించి అనుభవం కలిగిన టీచర్స్‌తో ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులకు మంచి భవిష్యత్‌ కల్పించాలన్నారు. విద్యలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయాలని, ఉపాధ్యాయులతో ముఖాముఖీగా చర్చ నిర్వహించారు. అనుభవం కలిగిన ఉపాధ్యాయుల సలహాలు, సూచనలు తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపాలని జిల్లా విద్యాశాఖ అధికారికి సూచించారు. జిల్లాలో ఎస్సీి, ఎస్టీలపై జరిగే దాడులకు సంబంధించి అట్రాసిటీ కేసులు నమోదు చేసి.. వాటిని సత్వరం పరిష్కరించాని సకాలంలో నష్ట పరిహారం చెల్లించాలన్నారు. అట్రాసిటీ కేసుల కు సంబంధించి సమస్యలు ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు పరిచే ఆవాస్‌ యోజన పథకం ద్వారా రాష్ట్రంలో గహాల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి శేఖర్‌, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి చెన్నయ్య, బీసీ సంక్షేమ, సాధికారత అధికారి యుగంధర్‌, స్త్రీ శిశుసంక్షేమ, సాధికారత అధికారి లక్ష్మి దేవి, భూగర్భ గనులు శాఖల అధికారులు, గురుకుల పాఠశాల ప్రిన్సిపాళ్ల్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.