Jul 08,2023 21:31

పార్వతీపురంటౌన్‌.. మాట్లాడుతున్న జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, చిత్రంలో డిప్యూటీ సిఎం రాజన్నదొర

ప్రజాశక్తి-పార్వతీపురం టౌన్‌ : బలహీన వర్గాల గుండె చప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అని డిప్యూటీ సిఎం పీడిక రాజన్నదొర, జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, వైసిపి జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్‌ రాజు అన్నారు. ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో పార్వతీపురం ఆర్‌టిసి కూడలి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహాన్ని శనివారం పునప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల కళ్లల్లో ఆనందం నింపే విధంగా సిఎం జగన్మోహన్‌ రెడ్డి అడుగులు వేస్తున్నారని తెలిపారు. ఇది ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని తెలిపారు. టిడిపి ప్రభుత్వ హయాంలో దోచుకోవడం, దాచుకోవడం తప్ప పేదల అభివృద్ధి కోసం చేసిందేమీ లేదన్నారు. చంద్రబాబు, పవన్‌ మాటలను ప్రజలెవరూ నమ్మొద్దని కోరారు.
గరుగుబిల్లి : గరుగుబిల్లిలో సర్పంచ్‌ కలిశెట్టి ఇందుమతి, నాయకులు రౌతు రామినాయుడు, బి.వెంకటాపురంలో సర్పంచ్‌ బొత్స లక్ష్మి, ఖడ్గవలస జంక్షన్లో వైసిపి నాయకులు అంబటి గౌరునాయుడు వైఎస్‌ఆర్‌ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు తెర్లి ఎల్లంనాయుడు, నల్ల శ్రీరాములునాయుడు, ముగిది సింహాచలంనాయుడు, చింతల మల్లినాయుడు, తదితరులు పాల్గొన్నారు.
పాలకొండ : పట్టణంలోని కార్గిల్‌ జంక్షన్‌లో వైఎస్‌ఆర్‌ విగ్రహానికి ఎమ్మెల్యే వి.కళావతి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్‌ రాశేఖరరెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. అన్ని వర్గాలకు అండగా నిలిచిన వ్యక్తన్నారు. అటువంటి సుపరిపాలన మరలా వైఎస్‌ తనయుడు జగన్మోహన్‌రెడ్డి అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంఎల్‌సి పాలవలస విక్రాంత్‌, నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ యందవ రాధాకుమారి, వైసిపి యువనాయకులు గువ్వల రమేష్‌బాబు, వైస్‌ చైర్మన్లు రౌతు హనుమంతురావు, పల్లా ప్రతాపరావు, వైసిపి పట్టణ అధ్యక్షులు వెలమల మన్మథరావు, వైస్‌ ఎంపిపి కనపాక సూర్యప్రకాష్‌ తదితరులున్నారు. అంతకు ముందు రమేష్‌బాబు ఆధ్వర్యంలో ఆస్పత్రి రోడ్డు నుంచి కార్గిల్‌ పాయింట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సి, రమేష్‌బాబు ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు.
సీతానగరం : మండలంలో పెదబోగిలి జంక్షన్లో వైఎస్‌ఆర్‌ విగ్రహానికి వైసిపి నాయకులు బి.శ్రీరాములునాయుడు, బి.చిట్టిరాజు, ఆర్‌వి పార్థసారథి, ఎంపిటిసి ఎస్‌.గౌరీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్‌ఆర్‌ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే సవరపు జయమణి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి ఎం.బాబ్జీ, నాయకులు ఎస్‌.రామారావు, ఎం.మాధవరావు, ఉపసర్పంచ్‌ కె.అరవింద్‌ కుమార్‌ పాల్గొన్నారు.
కురుపాం : స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు, గర్భిణులకు, బాలింతలకు మండల కో-ఆప్షన్‌ సభ్యులు షేక్‌ జిలాని పండ్లు, రొట్టెలు, ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిపి శెట్టి పద్మావతి, జెడ్‌పిటిసి జి.సుజాత, జిల్లా కోఆప్సన్‌ సభ్యులు షేక్‌ నిషార్‌, వైసిపి గ్రీవెన్స్‌ జిల్లా అధ్యక్షులు శెట్టి నాగేశ్వరరావు, సర్పంచ్‌ జి.సుజాత, వైస్‌ సర్పంచ్‌ షేక్‌ ఆదిల్‌, మాజీ ఎంపిపి ఐ.ఇంద్రకుమారి, ఎంపిటిసిలు వి.బంగారనాయుడు, టివిఎస్‌ స్వామియోజులు, మైనార్టీ నాయకులు షేక్‌ నూరేళ్ల పాల్గొన్నారు.
భామిని : మండలంలోని కొరమ గ్రామ కూడలి వద్ద ఎ.రఘుపతినాయుడు ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి బోనగడ్డి ధర్మారావు, వైసిపి సీనియర్‌ నాయకులు కొవ్వాడ చిరంజీవులు, బొడ్డేపల్లి ప్రసాదరావు, మజ్జి సంజీవ్‌రావు, అలజింగి షణ్ముఖరావు పాల్గొన్నారు.
ఘనంగా రైతు దినోత్సవం
సీతంపేట : మండలంలో పాతపనుకువలసలో ఉన్న ఎన్‌జి రంగా వ్యవసాయ పరిశోధన కేంద్రంలో రైతు దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రైతులకు అధిక దిగుబడులు వచ్చే విత్తనాలను సీనియర్‌ శాస్త్రవేత్త పి.సీతారాం అందజేశారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త లక్ష్మీనారాయణ, పి.సౌజన్య, కె.కాంతారావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక బస్టాండ్‌ వద్ద ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహానికి ఎంపిపి ఆదినారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్‌ మోహన్‌రావు, సర్పంచ్‌ కళావతి ఆదిలక్ష్మి, ఉప సర్పంచ్‌ పాలవలస బృందావతి, నాయకులు పాలవలస ప్రకాశ్‌, కన్వీనర్‌ సుమిత్ర తదితరులు పాల్గొన్నారు.