Jun 30,2023 01:11
బ్లడ్‌ కాంపోనెంట్స్‌ స్టోరేజ్‌ సెంటర్‌ను ప్రారంభిస్తున్న రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు

ప్రజాశక్తి-రేపల్లె: ప్రభుత్వ వైద్యశాలలోని రెడ్‌క్రాస్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో బ్లడ్‌ కాంపోనెంట్స్‌ స్టోరేజ్‌ సెంటర్‌ను రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల్లో కల్లా రక్తదానం గొప్పదని అన్నారు. రక్తదానం ప్రాణాలను నిలుపుతుందని అన్నారు. యువత రక్తదానానికి ముందు రావాలని కోరారు. రెడ్‌క్రాస్‌ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని, మానవతా దక్పథంతో సేవలందిస్తున్నాయి తెలిపారు. రేపల్లె ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ డాక్టర్‌ వసంతం వీర రాఘవయ్య మాట్లాడుతూ బ్లడ్‌ కాంపోనెంట్స్‌ స్టోరేజ్‌ సెంటర్‌కు దీనికి అవసరమైన యంత్ర సామగ్రి, అవసరమైన లైసెన్సులు వచ్చాయన్నారు. బ్లడ్‌ కాంపోనెంట్‌ స్టోరేజ్‌ రావటంతో రక్తంలోని లిక్విడ్‌లను, సెల్స్‌ను వేరుచేసి రక్త కణాలను భద్రపరిచే వీలుంటుందని చెప్పారు. రక్తం అవసరమైన క్షతాగాత్రునికి రక్తం కాకుండా సెల్స్‌ అందించటంతో దుష్ప్రభావాలు చోటు చేసుకోవన్నారు. తీరప్రాంత ప్రజలకు బ్లడ్‌ బ్యాంక్‌ సేవలను మరింత మెరుగ్గా అందించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు, బాపట్ల అర్బన్‌ ఏరియా డెవలప్మెంట్‌ అథారిటీ చైర్మన్‌ దేవినేని మల్లికార్జునరావు, హాస్పిటల్‌ డెవలప్మెంట్‌ సొసైటీ వైస్‌ చైర్మన్‌ వేజెండ్ల పూర్ణానంద్‌ ప్రభుత్వ వైశాల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సుధాకర్‌, బ్లడ్‌ బ్యాంక్‌ సిబ్బంది, ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది, రోటరీ క్లబ్‌ సభ్యులు సక్సేన తదితరులు పాల్గొన్నారు.