'బ్లాక్‌డే' నిరసనల హోరు
ప్రజాశక్తి - యంత్రాంగం
లఖీమ్‌పురి కేరి రైతుల మరణానికి కారణమైన బిజెపి ఎంపి కుమారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లావ్యాప్తంగా సిఐటియు, రైతుసంఘం, వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో 'బ్లాక్‌డే' నిరసనలు జరిగాయి. కెవిబిపురంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట రైతుసంఘం జిల్లా అధ్యక్షులు దాసరి జనార్ధన్, మండల కార్యదర్శి నాగలాపురం నాగరాజు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాటాల్డఉతూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు నిసన తెలిపామన్నారు. లఖింపూరికేరిలో రైతు నల్లాచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై అక్కడి బిజెపి ఎంపి కుమారుడు జీపుతోలి తొక్కించి నలుగురు రైతుల మృతికి కారణమయ్యారని, అషిష్‌మిశ్రాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మంత్రివర్గం నుంచి అతని తండ్రిని తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, శంకరయ్య, మురగేష్, రామయ్య, అంయ్య పాల్గొన్నారు.
నాగలాపురంలో... మండల కార్యదర్శి ఆర్.మురగేష్ ఆధ్వర్యంలో దినమణి, సుబ్బమ్మ, బాలాజీ, అముద పాల్గొన్నారు. సత్యవేడులో..మండల కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. అరుణాచలం, మురళి, శేఖర్, మునస్వామి, కృష్ణయ్య పాల్గొన్నారు. గూడూరులో... రైతుసంఘం కార్యదర్శి జోగి శివకుమార్ ఆధ్వర్యంలో జరిగింది. సురేష్, వెంకట రామిరెడ్డి, పుట్టా శంకరయ్య, మధు, అడపాల ప్రసాద్, బి.చంద్రయ్య, కోటేశ్వరరావు పాల్గొన్నారు. సూళ్లూరుపేటలో.. సుంకర అల్లెయ్య, కె.లక్ష్మయ్య, చంద్రశేఖర్, వేణు, ఆటో రమణయ్య ఆధ్వర్యంలో నిరసన జరిగింది. కేంద్ర ప్రభుత్వ గుండాగిరి వల్ల 850 మంది రైతులు ఉద్యమం సందర్భంగా అశువులు బాసారని అన్నారు. ఈ ప్రభుత్వ హత్యలకు కారణమైన కేంద్రమంత్రి కుమారుని అరెస్టు చేయాలని డిమాండ్‌చేశారు. తిరుపతిలో.. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కేంద్రమంత్రి అజరుమిశ్రాను, అతని కుమారుని ఆశిష్ మిత్రాలను పదవుల నుంచి తొలగించాలని నాలుగుకాళ్ల మండపం సర్కిల్లో మానవహారం నిర్వహించారు. సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కె.వేణుగోపాల్, ఎఐటియుసి నగర ప్రధాన కార్యదర్శి ఎన్‌డి. రవి, సిఐటియు జిల్లా అధ్యక్షులు జి.బాలసుబ్రమణ్యం, సిపిఐ జిల్లా కార్యదర్శి పి.మురళి, కె.రాధాక్రిష్ణ, మాగంటి గోపాలక్రిష్ణారెడ్డి, పి.హేమలత, సత్తార్ పాల్గొన్నారు.
తిరుపతిలో...










