Oct 03,2023 22:21

బ్లాక్‌ డే విజయవంతం

బ్లాక్‌ డే విజయవంతం
ప్రజాశక్తి - పుత్తూరు టౌన్‌: దేశ వ్యాప్తంగా కిషన్‌ సభ కార్మిక సంఘాలు పిలుపు మేరకు మంగళవారం పుత్తూరు అంబేద్కర్‌ సర్కిల్‌ ఎదురుగా సిఐటియు ఆధ్వర్యంలో బ్లాక్‌ డేకు నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్‌ వెంకటేష్‌. మాట్లాడుతూ సమస్యలు పట్టించు కోవడం లేదని, కార్మిక చట్టం అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌కేయం, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వాలు స్పందించడంలేదన్నారు. కొత్త కార్మిక హక్కులు, కార్మిక చట్టాలు అమలుతో కడుపు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఆటో కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పురుషోత్తం, రమేష్‌, బొబ్బిలి, సుబ్రహ్మణ్యం శివ, సుబ్రమణ్య పిళ్లై పాల్గొన్నారు.