Jun 27,2023 21:58

ఫొటో : ఏర్పాట్లను పరిశీలిస్తున్న నాయకులు

బక్రీద్‌ పండుగకు ముమ్మర ఏర్పాట్లు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ముస్లిం సోదరుల పవిత్ర పండుగ బక్రీద్‌ పర్వదినం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్‌ సర్థార్‌, మైనారిటీ నాయకుడు షేక్‌ రహీంలు పేర్కొన్నారు. గురువారం జరగనున్న బక్రీద్‌ పర్వదినం సందర్భంగా ముస్లీం సోదరులు ప్రార్థనలు నిర్వహించుకునే ఈద్గా మైదానాన్ని వారు వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్‌ ఖుదావన్‌, సుల్తాన్‌ షాహిద్‌ మసీదు మౌజన్లతో కలసి పరిశీలించారు.
ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఆదేశాల మేరకు ప్రార్థనలకు వచ్చే ముస్లీం సోదరులకు షామియానాలు, మంచినీటి వసతి, వజూ చేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు తప్పక చేయాలని కోరారు. స్పందించిన వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్‌ ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. వారివెంట వక్ఫ్‌బోర్డు సిబ్బంది, వైసిపి, మైనారిటీ నాయకులున్నారు.