Mar 21,2023 00:58
విఆర్‌వోల సమావేశంలో మాట్లాడుతున్న తహసీల్దార్‌ సుధారాణి

ప్రజాశక్తి-పిట్టలవానిపాలెం: మండలంలోని తాసీల బకాయిలు త్వరగా చెల్లించే విధంగా కృషి చేయాలని తహశీల్దారు సుధారాణి అన్నారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో సోమవారం ఆమె విఆర్‌వోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో తాసీలు సుమారు రూ.33.47 లక్షల బకాయిలు ఉన్నట్లు తెలిపారు. మార్చి నెలాఖరుకు మొత్తం బకాయిలు వసూలు చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దారు చరణ్‌, విఆర్‌ఒలు పాల్గొన్నారు.