కడప : విద్యుత్ సంస్థలో పనిచేసే ఉద్యోగి తాము చేయబోయే పనిమీద ముందుగా లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ ధర్మజ్ఞాని అన్నారు. ప్రధానంగా విద్యుత్ బకాయిలపై ప్రత్యేక దష్టి సారించాలని ఆదేశించారు. మంగళవారం కడప లోని విద్యుత్ భవన్ లోని సమావేశ మందిరంలో ఉమ్మడి వైఎస్‌ఆర్ జిల్లా అధికారులతో ఆర్థిక ప్రగతి పై సమీక్ష సమావేశం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ బిల్ స్టాప్ సర్వీసులు, విద్యుత్ చౌర్యంపై వేసిన అపరాధ రుసు ములు, డెవలప్మెంట్ ఛార్జీలు, మొండి బకాయిలు మొత్తం జిల్లాలో రూ. 47 కోట్ల మేర పేరుకపోయాయి అన్నారు. ఏ రోజుకు ఆ రోజు డబ్బు లు చెల్లించి విద్యుత్ కొనుగోలు చేసి వినియోగదారులకు సరఫరా చేస్తు న్నామని చెప్పారు. వినియోగదారులు వారి విద్యుత్ సమస్యలపై కార్యా లయాలకు వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా వారితో మమేకమై వారి సమ స్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికా రులను ఆదేశించారు. సమావేశంలో కార్పొరేట్ ఆఫీస్ తిరుపతి నుంచి అకౌంట్ ఆఫీసర్ రెవెన్యూ శ్రీధర్, yఎస్‌ఆర్ జిల్లా విద్యుత్ శాఖ సూప రింటెండింగ్ ఇంజినీర్ ఎస్.రమణ, సీనియర్ అకౌంట్ ఆఫీసర్ మధు, అకౌంట్స్ ఆఫీసర్ మల్లికార్జున్, కడప డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజి నీర్ ఎల్. నరసింహప్రసాద్, వైఎస్‌ఆర్, అన్నమయ్య జిల్లాల అకౌంట్స్ అధికారులు పాల్గొన్నారు.










