Sep 09,2023 01:12

ప్రజాశక్తి - వేటపాలెం
బియ్యం కొనుగోలుదారులకు ధరలకు తగ్గ నాణ్యమైన బియ్యం అందించాలని సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ డీటీ ఓంకారం సూచించారు. స్థానిక గడియార స్తంభం సెంటర్లోని బియ్యం విక్రయ కేంద్రాల వద్ద ఆయన శుక్రవారం విచారణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పందన ఆన్లైన్ ఫిర్యాదు మేరకు విచారణ నిమిత్తం వచ్చినట్లు తెలిపారు. బియ్యం షాపుల యజమానులతో సమావేశమయ్యారు. బియ్యం రకాలు, వాటి ధరలు పట్టికలను షాపుల ముందు ఉంచాలని సూచించారు. వివిధ షాపుల్లోని బియ్యం నాణ్యతలను గుర్తించేందుకు శాంపిల్స్ సేకరించామన్నారు. ఎలాంటి అవకతవకలకు పాల్పడినా చట్టపరిధిలో చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రేపల్లె ఎన్ఫోర్స్మెంట్ డిటి తోట నిరంజన్ పాల్గొన్నారు.