ప్రజాశక్తి - కురుపాం : మండలంలోని మరిపిల్లి పంచాయతీలో గల నాగర బిటి రహదారి నుంచి సంతోష్ పురం గ్రామం వరకు 680 మీటర్లు రూ.40లక్షలతో అలాగే పొడి పంచాయతీలో సంతోషపురం గ్రామం నుంచి మీగడ వరకు 1860 మీటర్లు రూ.కోటీ 50 లక్షలతో కొత్తగా మంజూరైన బిటి రోడ్డు పనులను స్థానిక ఎమ్మెల్యే పి.పుష్ప శ్రీవాణి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణం వల్ల గిరిజన గ్రామాల ప్రజలకు రోడ్డు సౌకర్యం కలుగుతూ రాకపోకలకు ఇబ్బందుల్లేకుండా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపిపి శెట్టి పద్మావతి, జెడ్పిటిసి సభ్యులు జి.సుజాత, జిల్లా కో ఆప్షన్ సభ్యులు షేక్ నిసార్, వాణిజ్య విభాగాల వైసిపి జిల్లా అధ్యక్షులు అంధవరపు కోటేశ్వరరావు, మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ జిలానీ, మండల కన్వీనర్ ఐ.గౌరీశంకర్, వైసిపి మైనార్టీ విభాగ నాయకుల షేక్ నూరేళ్ల, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










