ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరంలోని గంటస్తంభం నుండి అంబేద్కర్ జంక్షన్ వరకు రూ.1కోటి రెండు లక్షలతో నిర్మించిన బిటి రోడ్డును డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ప్రారంభించారు. అనంతరం ఫ్లోర్ లీడర్ ఎస్ వివి రాజేష్, వైసిపి నగర అధ్యక్షుడు ఆశపు వేణు మీడియాతో మాట్లాడుతూ నగర సుందరీకరణకు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఇప్పటికే నగరంలోని అనేక ప్రధాన రహదారులను విస్తరించి ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. గణేష్ కోవెల నుండి ఎస్‌బిటి మార్కెట్ వరకు, మయూరి జంక్షన్ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు, ఆర్‌అండ్‌బి నుండి పాల్ నగర్ వరకు ఇలా అనేక రహదారులు నూతనంగా నిర్మించి ప్రజలకు సౌకర్యవంతమైన సేవలను అందిస్తున్నారని కొనియాడారు. త్వరలో అంబటి సత్రం రహదారిని కూడా నిర్మించనున్నట్లు చెప్పారు. సమస్యలు లేని నగరంగా రూపొందించడమే కోలగట్ల ఆశయమని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి , నగరపాలక సంస్థ ఇఇ కె.శ్రీనివాసరావు, వైసిపి నాయకులు కుమ్మరిగంటి శ్రీనివాసరావు, ప్రకాశ్ సిల్క్ అధినేత ఉప్పు ప్రకాశరావు, కాపుగంటి ప్రకాష్ ,తదితరులు పాల్గొన్నారు.










