
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరంలోని దాసన్నపేట రైతు బజార్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన బిటి రహదారిని గురువారం డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభించారు. 40 లక్షల రూపాయలతో రహదారి సౌకర్యాన్ని మెరుగుపరిచారు. కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, కార్పొరేటర్లు పొంతపల్లి మాలతి, నాయన పద్మ, వైసిపి జోనల్ ఇన్‌ఛార్జులు బొద్దాన అప్పారావు, బోడసింగి ఈశ్వరరావు, వైసిపి నాయకులు నాయన మహేష్, పొంతపల్లి గోపి తదితరులు పాల్గొన్నారు.
దుర్గాదేవి మండపాల సందర్శన
నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన దుర్గాదేవి నవరాత్రి మండపాలను డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కామాక్షమ్మ ఆలయ చైర్మన్ ఎ.బి.సోమరాజు, వైసిపి విద్యార్థి విభాగం అధ్యక్షుడు కేదారశెట్టి లక్ష్మణమూర్తి తదితరులు పాల్గొన్నారు.