అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న డిప్యూటీ స్పీకర్, మేయర్
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరంలోని తోటపాలెం సిద్ధార్థనగర్, మౌర్య గార్డెన్స్ ప్రాంతాల్లో సుమారు రూ.34 లక్షల వ్యయంతో చేపట్టిన బిటి రోడ్డు, ఇతర అభివృద్ధి పనులను డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్‌గా నగరం కనిపించే విధంగా పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే డివిజన్ పర్యటనలో గుర్తించిన సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ లయ యాదవ్, కార్పొరేటర్ భోగాపురపు లక్ష్మి, వైసిపి జోనల్ ఇన్‌ఛార్జులు రెడ్డి గురుమూర్తి, బాలబ్రహ్మారెడ్డి, నాయకులు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.










