Jul 20,2023 22:08

గుమ్మలక్ష్మీపురం : మండలంలోని లక్కగూడ పంచాయతీ సదునుగూడకు చెందిన రూ.75 లక్షల వ్యయంతో మంజూరైన 1000 మీటర్ల బిటి రోడ్డు పనులను స్థానిక ఎమ్మెల్యే పి. పుష్ప శ్రీవాణి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణం వల్ల గిరిజన గ్రామాల ప్ర

 కురుపాం: మండలంలోని వబ్బంగి పంచాయతీలో గల గానలికి రూ.60 లక్షలతో కొత్తగా మంజూరైన బిటి రోడ్డు పనులను స్థానిక ఎమ్మెల్యే పి.పుష్ప శ్రీవాణి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణం వల్ల గిరిజన గ్రామాల ప్రజలకు రోడ్డు సౌకర్యం కలుగుతూ రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపిపి శెట్టి పద్మావతి, జెడ్పిటిసి సభ్యులు జి.సుజాత, జిల్లా కో ఆప్షన్‌ సభ్యులు షేక్‌ నిసార్‌, వాణిజ్య విభాగాల వైసిపి జిల్లా అధ్యక్షులు అంధవరపు కోటేశ్వరరావు, మండల కో ఆప్షన్‌ సభ్యులు షేక్‌ జిలానీ, మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ జి.సుజాత, ఉప సర్పంచ్‌ షేక్‌ఆదిల్‌, మండల కన్వీనర్‌ ఐ. గౌరీశంకర్‌, వైసిపి మైనార్టీ విభాగ నాయకుల షేక్‌ నూరేళ్ల, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.