Jul 10,2023 21:58

రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి

ప్రజాశక్తి - కురుపాం : మండలంలోని వేగులవాడ పంచాయతీలో గల జోడుమానుగూడలో రూ.4 కోట్ల 80 లక్షలతో కొత్తగా మంజూరైన 7.50 కిలోమీటర్ల బిటి రోడ్డు పనులను స్థానిక ఎమ్మెల్యే పి. పుష్ప శ్రీవాణి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణం వల్ల నాలుగు గిరిజన గ్రామాల ప్రజలకు రహదారి సౌకర్యం కలుగుతుందన్నారు.
వలసబల్లేరు లో గడప గడపకు
మండలంలోని వలసబల్లేరులో ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి గడప గడపకు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో నేరుగా ప్రజలకు అడిగి తెలుసుకొని ఇంకేమైనా సమస్యలుంటే సచివాల సిబ్బందికి, వాలంటరీలకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపిపి శెట్టి పద్మావతి, జెడ్‌పిటిసి సభ్యులు జి.సుజాత, వాణిజ్య విభాగాల వైసిపి జిల్లా అధ్యక్షులు అంధవరపు కోటేశ్వరరావు, మండల కో-ఆప్షన్‌ సభ్యులు షేక్‌ జిలాని, ఎంపీటీసీలు ఎం.రాజేశ్వరి, జి.విద్యరాణి, మేజర్‌ పంచాయితీ సర్పంచ్‌ జి.సుజాత, ఉప సర్పంచ్‌ షేక్‌ఆదిల్‌, మండల కన్వీనర్‌ ఐ.గౌరీశంకర్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.