
ప్రజాశక్తి - కురుపాం : మండలంలోని నీలకంఠాపురం పంచాయతీలో గల పలు గిరిజన గ్రామాలకు బిటి రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జుంబిరి బిటి రోడ్డు నుంచి నాయుడుగూడ వయా పెద్దగూడ వరకు 2.60 కిలోమీటర్లు రూ.కోటీ 50 లక్షలు, పెద్దగూడ నుండి కొత్తపేట జంక్షన్ వరకు 40 మీటర్లు రూ.32 లక్షలు, పెద్దగూడ కొత్తపేట రోడ్డు నుంచి సిరిపురం వరకు 1.80 కిలోమీటర్లు రూ.కోటీ 35 లక్షలతో నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి శెట్టి పద్మావతి, జెడ్పీటీసీ జి.సుజాత, స్థానిక సర్పంచ్ ఎ.మన్మధరావు, జిల్లా కో ఆప్షన్ సభ్యులు షేక్ నిషార్, మండల కన్వీనర్ గౌరీశంకర్, వైసిపి వాణిజ్య విభాగాల అధ్యక్షులు అంధవరపు కోటేశ్వరరావు, ఐటిడిఎ డిఇ సింహాచలం, ఎఇ అప్పారావు, ఎంపీటీసీలు, సర్పంచులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.