Jun 13,2023 23:19

మాట్లాడుతున్న టిడిపి బిసి సాధికార సమితి కన్వీనర్‌ సురేంద్ర

ప్రజాశక్తి-అనకాపల్లి
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర్నుండి అన్ని రంగాల్లో బీసీలను అణిచివేతకు గురి చేస్తుందని టిడిపి బిసి సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ మళ్ల సురేంద్ర ఆరోపించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం బీసీ నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీల భవిష్యత్తుకు గ్యారెంటీ తెలుగుదేశం పార్టీతోనే ఉందని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీలకు ఆదరణ పథకం ద్వారా న్యాయం చేశారని, సబ్సిడీతో కూడుకున్న రుణాలు అందించారని, బీసీలకు రాజ్యాంగ పదవులు అప్పచెప్పారని గుర్తు చేశారు. బీసీ ఓట్లతో గద్దనెక్కిన జగన్మోహన్‌ రెడ్డి వారిని విస్మరించారని ఆరోపించారు. బీసీలంతా ఐక్యంగా ఉంటూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు తిప్పన అప్పారావు, దాడి జగన్‌, ఎండకుర్తి అప్పలరాజు, వానపల్లి కోటేశ్వరరావు, నర్సింగరావు, శ్యాంసుందర్‌, వేగికృష్ణ, పెంటకోట శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.