Sep 30,2023 21:57

ప్రజాశక్తి - కాళ్ల
            పార్లమెంట్‌లో బిసి బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని, బిసి కులగణన చేపట్టాలని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ ఎన్‌.మారీస్‌ డిమాండ్‌ చేశారు. మండలంలోని బొండాడలో ఉండి నియోజకవర్గ బిసి సంఘం ఆత్మీయ సమావేశ్నా శనివారం నిర్వహించారు. ఆత్మీయ సమావేశానికి నియోజకవర్గ బిసి సంఘ కన్వీనర్‌ మన్నే నాగరాజు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర బిసి సంఘ అధ్యక్షులు డాక్టర్‌ ఎన్‌.మారీస్‌ మాట్లాడుతూ బి.సి ఉద్యోగులకు ప్రమోషన్లు, రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. వైసిపి నియోజకవర్గ పరిశీలకురాలు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌.నరసింహరాజు, రాష్ట్ర బిసి సంఘ మహిళ అధ్యక్షరాలు వేముల బేబీరాణి, జిల్లా అధ్యక్షులు సూరవరపు వెంకటాచార్యులు మాట్లాడారు.
ఉండి నియోజకవర్గ బిసి కమిటీ ఎన్నిక
కన్వీనర్‌గా మన్నే నాగరాజు, బి.భాస్కరరావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా అంగర రామలింగయ్య, ప్రధాన కార్యదర్శిగా బోయిన దుర్గాప్రసాద్‌, ఉపాధ్యక్షులుగా బోధనపు కన్నయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కాళ్ల మండల బిసి కమిటీ
కన్వీనర్‌గా పొట్లూరి రామారావు, ఉపాధ్యక్షు లుగా నాగరాజు, ప్రధాన కార్యదర్శులు పడమట సతీష్‌, కేత దుర్గారావు, మరో ఆరుగురు సభ్యులు ఎన్నికయ్యారు.