Nov 14,2023 18:53

మాట్లాడుతున్న ఇంటూరి నాగేశ్వరరావు

ప్రజాశక్తి-కందుకూరు : వైసిపి పరిపాలనలో ఎక్కువగా నష్టపోయింది బిసిలేనని, వారంతా ఐకమత్యంగా ఉండి రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్‌ రెడ్డికి తమ సత్తా ఏమిటో చూపాలని కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. బిసిలకు ప్రభుత్వ నమ్మకద్రోహంపై జిల్లా టిడిపి బిసి విభాగం ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీన నెల్లూరులో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నారు. దానికి సంబంధించి బిసిలను సమాయత్తం చేసేందుకు కందుకూరులోని పార్టీ కార్యాలయంలో ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నేతలంతా మంగళవారం సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు డాక్టర్‌ దివి శివరాం, జడ్పీ మాజీ చైర్మన్‌ చెంచలబాబు యాదవ్‌, రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, ఆప్కాబ్‌ మాజీ చైర్మన్‌ కె. పోలిశెట్టి, రాష్ట్ర ముదిరాజ్‌ సాధికార సమితి కన్వీనర్‌ పి. లక్ష్మణరావు, నెల్లూరు పార్లమెంట్‌ ఉపాధ్యక్షులు అన్నం దయాకర్‌ గౌడ్‌, ఇతర బీసీ నేతలు సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత జరిగిన మీడియా సమావేశంలో ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడారు. జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బలహీనవర్గాలపై అధిక సంఖ్యలో దాడులు జరిగాయని, ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేశారని విమర్శించారు. దివి శివరాం మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి అభివద్ధిని పక్కనపెట్టి, కేవలం బటన్లు నొక్కటం పైనే దష్టి పెట్టారని అన్నారు. ముఖ్యమంత్రి ఆర్భాటంగా బటన్లు నొక్కడం తప్ప, సగం మందికి కూడా డబ్బులు జమ కావడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, రాష్ట్ర బిసి సెల్‌ కార్యనిర్వాహక కార్యదర్శి చిలకపాటి మధు, నియోజకవర్గ బీసీ సెల్‌ అధ్యక్షుడు మద్దసాని కష్ణ, గుడ్లూరు మండలం బీసీ సెల్‌ అధ్యక్షుడు గద్దగుంట శ్రీనివాసులు, ఉమ్మడిపోలు కోటేశ్వరరావు, కొమరగిరి రమణయ్య, జాజుల కొండయ్య, తిరుపతి బుల్లయ్య, మద్దసాని శ్రీనివాసులు, పోలుగొంగు కష్ణ, పాపన బోయిన శ్రీనివాసులు, మేకపోతుల మాలకొండయ్య, కాకు నాగేశ్వరరావు ఉన్నారు.