Mar 29,2023 01:23
కొల్లు రవీంద్రను సన్మానిస్తున్న బిసి కార్యదర్శి డోలా

ప్రజాశక్తి-భట్టిప్రోలు: రాష్ట్రంలో బిసి వర్గాల అభ్యున్నతి, అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని మాజీమంత్రి, రాష్ట్ర బిసి సెల్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులు కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం మంగళగిరిలోని టిడిపి జాతీయ ప్రధాన పార్టీ కార్యాలయంలో 1.3 జోన్‌ పరిధిలోని పార్టీ నాయకులకు సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామానికి చెందిన బిసి సెల్‌ రాష్ట్ర కార్యదర్శి పులిమి డోలా శివకుమార్‌ కొల్లు రవీంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు పదవి అప్పగించినందుకు కృతజ్ఞతగా దుశ్శాలువతో సత్కరించారు. పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని డోలా హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు దీపాల శివ ప్రసాద్‌, మాచర్ల నాగరాజు, పట్టేం గోపాలరావు, కౌతారపు యశోద, వమనపల్లి కోటేశ్వరరావు, అనగాని ఏడుకొండలు తదితరులు ఉన్నారు.