Oct 14,2023 22:14

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సర్పంచ్‌

ప్రజాశక్తి-పలమనేరు: గంగవరం మండలంలో నిర్వహించిన పలు ప్రభుత్వ కార్యక్రమాలలో తనను అవమానించారని కీలపట్ల పంచాయతీ సర్పంచ్‌ చంద్రశేఖర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం పలమనేరు టిడిపి కార్యాలయంలో విలేకరుల సమా వేశం నిర్వహించి మాట్లాడారు. రెండు రోజుల ముం దు గంగవరంలో జరిగిన పలు అభివృద్ధి కార్య క్రమాలకు సంబంధించి తనకు సమాచారం ఇవ్వ లేదని మండిపడ్డారు. స్థానిక సర్పంచ్‌ లేకుండా అధి కారులు అధికారిక కార్యక్రమాలు ఎలా నిర్వహి స్తారంటూ ప్రశ్నించారు. బిసిలంటే ఈ ప్రభుత్వానికి నేతలకు పడదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్‌ పాటించని అధికారుల తీరు పట్ల అస హనం వ్యక్తం చేశారు. మండల కన్వీనర్‌ సోమశేఖర్‌ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధికి అధికారులు, అధికార పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా అని మండిపడ్డారు. అదే విధంగా ఇంటింటి టిడిపి కార్యక్రమంలో పెద ్దపంజాణి మండలం శివాడి గ్రామంలో ఏర్పాటుచేసిన పార్టీ జెండాలు, తోరణాలను తొలగించడాన్ని ఖండిం చారు. కార్యక్రమంలో నాయకులు రవి, వెంకట రమణారెడ్డి, గోవిందరాజులు, గణేష్‌ పాల్గొన్నారు.