
ప్రజాశక్తి-విఆర్.పురం
మండల కేంద్రంలోని బీసీ కాలనీ గ్రామాన్ని ముంపు జాబితాలో చేర్చి నష్టపరిహారం ఇప్పించాలని పోలవరం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రవీణ్ ఆదిత్యకు ఆ గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం వారు ప్రవీణ్ ఆదిత్యను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో సుమారు 250 కుటుంబాలు ఉన్నాయని, తమ గ్రామాన్ని సర్వే అధికారులు సర్వే చేయడం జరిగిందని, పేపర్ ప్రకటన వెంటనే వచ్చేలాగా చూడాలని కోరారు. దీనికి స్పందించిన ప్రవీణ్ ఆదిత్య వారం పది రోజుల్లో పిఎన్ నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. సానుకూలంగా స్పందించిన అధికారులకు బీసీ కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ కాలనీ ప్రజలు వెనకటగిరి నాగార్జున, అలివేలు సరోజిని, రోశయ్య, వెంకన్న, శంకర్, అలజంగి శ్రీనివాస్, సువర్ణ రాజు తదితరులు పాల్గొన్నారు.