Jul 21,2023 21:35

భూ పోరాట కమిటీ జిల్లా అధ్యక్షులు బి. నారాయణ

కాశినాయన : మండలంలోని ఓబులాపురం, సర్వే నంబర్‌ - 1లో బద్వేలు పట్టణానికి చెందిన రామకష్ణ అనే భూకబ్జాదారుడికి ఇచ్చిన బినామీ పట్టాలు రద్దు చేసి స్థానికులైన పేదలు న్యాయం చేయాలని జిల్లా భూ పోరాట కమిటీ అధ్యక్షులు బి.నారాయణ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తహశీల్దార్‌ రామచంద్రుడిని కలిసి భూకబ్జాలపై వివరించారు. ఈ సందర్భంగా బి. నారాయణ మాట్లాడుతూ ఓబులాపురం సర్వే నంబర్‌-1లో దాదాపు 73 ఎకరాల పొలం ఉందని, స్థానికేతరుడైన రామకృష్ణ అనే వ్యక్తి 30 ఎకరాలు బినామీ పట్టాలు పొందారని చెప్పారు. స్థానికుడైన రిటైర్డ్‌ ఆర్మీ ప్రసాద్‌ అనే వ్యక్తి ఐదెకరాలు పట్టా చేయించుకుని అన్ని ఆధారాలతో భూమి వద్దకు వెళ్తే కబ్జాద ారురుడైన రామకృష్ణ ఆర్‌డిఒకు, రెవెన్యూ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఇబ్బంది పడెతున్నారని తెలి పారు. అసైన్‌మెంట్‌ కమిటీ లేకుండా, సబ్‌ డివిజన్‌ కాకుండా 30 ఎకరాలకు ఆయన కంచె ఎలా వేస్తాడని ప్రశ్నించారు. పేదలు ఎవరైనా భూములు సాగు చేసుకుంటే వెంటనే రెవెన్యూ అధికారులు అడ్డుక ుంటారని, కబ్జాదారుడు 30 ఎకరాల్లో కంచె వేస్తే చూస్తూ ఊరుకుని ఉండడం సమంజసం కాదని వాపోయారు. రెవెన్యూ అధికారులు త్వరలో పేదలకు న్యాయం చేయ కపోతే వ్యవసాయ కార్మిక సంఘం, జిల్లా భూపో రాట కమిటీ ఆధ్వర్యంలో అక్కడి పేదలకు తామే న్యాయం చేయాల్సి వస్తుందని, దీనంతటికీ రెవె న్యూ అధి కారుల బాధ్యత వహించాలని ఆయన తెలిపారు. రామకష్ణ అనే భూకబ్జా దారునికి ఆర్మీ పట్టాలు 30 ఎకరాలకు ఎలా వచ్చాయని, కలెక్టర్‌ ఉత్త ర్వులు ఉన్నాయా, అసలు కమిటీలో పాస్‌ అయ్యాయనే విషయాలు తహశీల్దార్‌ క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. ఒకే కుటుంబంలో 30 ఎకరాలు ఒకే చోట భూమి ఎలా ఇస్తారని ఇక్కడ పట్టగల వారికీ పోరు మామిళ్ల మండలంలోనూ భూమి ఉన్నట్లు తెలిసిందని ఆయన తహశీల్దార్‌ దష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా కలసపాడు మండలం పిడుగుపల్లె గ్రామానికి చెందిన రాజారెడ్డి అనే వ్యక్తి అదే సర్వే నెంబర్లు 20 ఎకరాలు పట్టాలు కలిగి ఉన్నారని దీనిపైనా విచారిం చాలన్నారు. తహశీల్దార్‌ను కలిసిన వారిలో బిఎస్‌పి బిఎస్సి జిల్లా ప్రధాన కార్యదర్శి సగిలి గురప్ప జర్నలిస్టు అసోసియేషన్‌ సీనియర్‌ నాయకులు సి.ఆంజనేయులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్‌, జిల్లా సహాయ కార్యదర్శి గురవయ్య, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రాజేంద్ర పాల్గొన్నారు.