Jun 21,2023 19:14

రైతులకు అవగాహన కల్పిస్తున్న ఎడిఇ రాఘవేవంద్ర

ప్రజాశక్తి - పెద్దకడబూరు
విద్యుత్‌ బిల్లులు సకాలంలో చెల్లించి నాణ్యమైన విద్యుత్‌ వాడుకోవాలని ఎడిఇ రాఘవేంద్ర రైతులకు సూచించారు. బుధవారం మండలంలోని బసలదొడ్డి గ్రామ శివారులోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఆవరణంలో విద్యుత్‌ వాడకంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడిఎ రాఘవేంద్ర మాట్లాడారు. అనవసరంగా లైట్లు, ఫ్యాన్లు వేయవద్దని తెలిపారు. బసలదొడ్డి, నాగలపురం గ్రామాల్లో రైతులు సమస్యలను ఎడిఇ దృష్టికి తెచ్చారు. తాగునీటి బోర్లకు 24 గంటలూ విద్యుత్‌ సరఫరా చేయాలని కోరారు. శిథిలావస్థకు చేరిన విద్యుత్‌ స్తంభాలను తొలగించాలని తెలిపారు. పైరయ్య స్వామి గుడి వరకు రహదారి వెంట విద్యుత్‌ లైన్‌ వేయాలని, లోవోల్టేజీ సమస్యను అధిగమించేందుకు అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలని కోరారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని ఎడిఇ హామీ ఇచ్చారు.