
రాయచోటి : ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు అన్ని రకాల సేవలు ఒకేచోట అందించాలనే లక్ష్యంతో డిజిటల్ గ్రంథాలయాలను మంజూరు చేసింది. వాటికి సంబంధించిన నిర్మాణ పనులు జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. నిధుల లేమి, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపుల్లో ఆలస్యం కావడంతో, కొన్ని చోట్ల స్థలాల సేకరణ, కోర్టు, వివిధ రకాల కారణాల వల్ల పాల కేంద్రాలు భవన నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి.
జిల్లాలో 91 డిజిటల్ గ్రంథాలయ భవనాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా నాలుగు భవనాలు మాత్రమే పూర్తి చేశారు. 45 భవనాలకు కనీసం పునాదులు కూడా తీయలేదు. డిజిటల్ గ్రంథాలయాల నిర్మాణ పనుల బాధ్యతను పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగానికి అప్పగించారు. 2022వ సంవత్సరంలో ఒక్కో భవన నిర్మాణానికి రూ.16 లక్షల చొప్పున జిల్లాలో 91 భవనాలను మంజూరు చేశారు. తరువాత టెండర్లు పిలిచి నిర్మాణ పనులు ప్రారంభించారు. జిల్లాలో 45 చోట్ల భూమి వాదాలు, కోర్టు, కాంట్రాక్టు ముందుకు రాక పోవడం వంటి కారణాలతో పనులు ఇంత వరకు ప్రారంభించలేదు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో 21 డిజిటల్ గ్రంథాలయాలు మంజూరయ్యాయి. ఇప్పటివరకు మొదలుపెట్టినవి 10, మట్టి తీసినవి 7, పునాదులు 7, గోడలు 0, స్లాబ్ 0, పూతల 0, పూర్తయినవి 0, మదనపల్లి నియోజకవర్గంలో 4 మంజూరు కాగా 4 పనులు మొదలు పెట్టలేదు. పీలేరు నియోజకవర్గంలో 20 మంజూరు కాగా 7, ఇంతవరకు మొదలు పెట్టినవి 7, మట్టి తీసినవి 9, పునాదులు 2,పూర్తి చేసినవి 2, రాయచోటి నియోజకవర్గంలో 13 మంజూరు కాగా, మొదలు పెట్టినవి 5, మట్టి తీసినవి 2, పునాదులు 2, గోడలు ఒకటి, పూర్తయినవి ఒకటి మాత్రమే ఉన్నాయి. రాజంపేట నియోజకవర్గంలో 12 మంజూరు గాక ఇంతవరకు మొదలుపెట్టినవి 9, పునాదులు ఒకటి మాత్రమే చేశారు. రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో 21 మంజూరు కాగా ఇంతవరకు మొదలుపెట్టినవి 10, మట్టి తీసినవి 2, పునాదులు ఒకటి, గోడలు ఒకటి, పూర్తయినవి ఒకటి మాత్రమే చేశారు. మిగిలినవి వివిధ దశ లలో నిలిచి పోయాయి. ఇప్పటి వరకు 4 శాతం మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన 96 శాతం పూర్తి కావాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందోనని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన పనులకు కూడా సకాలంలో బిల్లు రాలేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. 2024 సంవత్సరం చివరికి 100 శాతం పూర్తి చేయాలని ప్రభుత్వం పేర్కొంటుంది. సకాలంలో డిజిటల్ గ్రంథాలయాల భవనాలు పూర్తి స్థాయిలో అవుతాయో లేదో వేచిచూడాల్సిందే.
నిర్మాణ పనులు వేగవంతం చేస్తాం
జిల్లాలో డిజిటల్ లైబ్రరీ భవన నిర్మాణ పనులను 2024 సంవత్సరానికి పూర్తి చేయడానికి వేగవంతం చేస్తున్నాం. మండల ఇంజినీర్లతో ప్రతివారం సమీక్షంచి సమావేశాలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం బిల్లు సకాలంలో కూడా అందుతున్నాయి. డిసెంబర్ చివరి నాటికి నాటికి వంద శాతం భవన నిర్మాణాలను పూర్తిచేయడానికి అన్ని చర్యలు తీసుకుంటుకున్నాం.
-ఎం.దయాకర్‌రెడ్డి, పిఆర్‌ఎస్‌ఇ, రాయచోటి.