ప్రజలకు వాతపేద, ధనిక అని తేడా లేకుండా విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయాయి. వినియోగాదారుడు విద్యుత్ బిల్లులు చూస్తే షాక్ గురయ్యే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం రకరకాల ఛార్జీల పేరుతో అదనంగా వసూలు చేస్తోంది. దీంతో సామాన్య ప్రజలు అల్లాడి పోతున్నారు. ప్రభుత్వాలు వసూలు చేస్తున్న అదనపు భారాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అదనపు వసూళ్లపై వినియోగదారుల అభిప్రాయమాళిక. అధిక బిల్లులతో ఇబ్బందులువిద్యుత్ బిల్లులు అధి కంగా వస్తుండడంతో కుటుంబంపై ఆర్థిక భారం పడుతోంది. గతంలో కరెంటు బిల్లు ఇం టికి రూ.300 వచ్చేది. అంతే యూనిట్లు కాల్చినా ప్రస్తుతం రూ. 600 వస్తోంది. నా చిల్లర అంగడికి గతంలో రూ.600 వ చ్చేది. ఇప్పుడు రూ.900 వస్తోంది. బి ల్లులో అడిషనల్ పేరుతో రకరకాల ఛార్జీలు వేస్తున్నారు.
-శ్రీనువాసులు, వేంపల్లె.రూ.150 అదనపు బిల్లు ప్రతి నెల రూ. మూడు వందల నుం చి రూ.350 వచ్చే బిల్లుకు ఈ నెల అదనంగా రూ.150 సర్దుబాటు ఛార్జీలను కలిపారు. దీంతో రూ. 520 కరెంట్ బిల్లు వచ్చింది ప్రభుత్వం అనేక రకాల ఛారీ ్జలను కలుపుతూ అధిక భారం మోపు తోంది. బిల్లులో దాదాపు సగం సర్దుబాటు చార్జీలు వేశారు.పేద ప్రజ లకు చాలా ఇబ్బందిగా ఉంది - హరి, మైదుకూరు.ఛార్జీలు తగ్గించాలిప్రభుత్వం ట్రూ ఆఫ్, సర్ ఛార్జీలతో పెంచి సామాన్య వ్యాపారుల పై అధికభారం మో పింది. అధిక బిల్లులు చూసి చిన్న వ్యాపారులు ఉక్కిరిబిక్కిరి అవు తు న్నారు. గతంలో రూ. 200 వచ్చే బిల్లు ప్రస్తుతం రూ. 900 వచ్చింది. ప్రభుత్వం వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలి.
-గుర్రంపాటి విశ్వనాథరెడ్డి, కూల్ డ్రింక్ షాప్ యజమాని, వల్లూరు.బిల్లు ముట్టుకుంటే షాక్ నిత్యావసర, కూరగాయల రేట్లు ఆకాశానంటుతున్న నేపథ్యంలో విద్యుత్ ఛార్జీలు సామా న్యుడిపై పెనుభారం మోపింది. నెలనెలా వచ్చే విద్యుత్ బిల్లును ముట్టుకుంటే షాక్ కొడుతోంది. మధ్యతరగతి, పేదలకు బిల్లులు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
- యం.లక్ష్మీనారాయణమ్మ, గహిణి, బద్వేలు.ఛార్జీలు పెంచడం అన్యాయంరాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెం చడం అన్యాయం. పేద, మధ్య తరగతి వారు బిల్లులు చెల్లిం చలేక ఇబ్బందులు పడుతున్నారు. వాడిన యూనిట్లు కంటే అదనపు ఛార్జీలే ఎక్కువగా ఉంది. అద్దె ఇళ్లల్లోని వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే అదనపు ఛార్జీలను వసూలు చేయడం ఆపాలి.
-ప్రసాద్‌రెడ్డి, పులివెందులప్రజలపై అదనపు భారంప్రజలపై విద్యుత్ భారం తీవ్రంగా ఉంది. అద్దె ఇంటిలో నివసించే వారికి విద్యుత్ ఛార్జీలు పెను భారంగా మారాయి. ఇంటి బాడుగలు కట్టలేక అతలాకుతలం అవుతున్నారు. సర్దుబాటు, ట్రూఅప్, సర్, కస్టమర్ ఛార్జీలు, అదనపు లోడ్ డిపాజిట్లు.. ఇలా వివిధ రూపాల్లో ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తోంది. -డి.ప్రభాకర్‌రెడ్డి, టాక్సీ స్టాండ్ ప్రెసిడెంట్, మదనపల్లె.మోటర్లకు మీటర్లు సరికాదు ప్రభుత్వం ఒకవైపు విద్యుత్ ఛార్జీలు పెం చుతూ మరో వైపు మో టర్లకు మీటర్లు బిగి స్తాననడం సరికాదు. మా వ్యవసాయ భూములకు మీటర్లు అ మర్చేందుకు పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, జిరాక్స్ తీసు కున్నారు. నగదును మీ అకౌంట్‌లో బదిలీ చేస్తామని అధికారులు చెబు తున్నారు. నగదు బదిలీపై నమ్మకం లేదు.
- శ్రీరామలు, బి.కొత్తకోట










