Oct 30,2022 22:27

ప్రజాశక్తి -తిరువూరు
నవంబర్‌ 1వ తేదీన మైలవరంలో జరుగనున్న బిల్డింగ్‌ వర్కర్స్‌ యూని యన్‌ (సిఐటియు) ఎన్టీఆర్‌ జిల్లా 9వ మహాసభను జయప్రదం చేయాలని యూనియన్‌ రాష్ట్ర నాయకులు పిల్లి నరసింహారావు పిలుపునిచ్చారు. స్థానిక జంట థియేటర్ల సెంటర్‌ లో ఆదివారం మహాసభ కరపత్రాలను నరసిం హారావు యూనియన్‌ మండల నాయకులతో కలిసి విడుదల చేశారు. మహా సభ రోజున మైలవరంలో కార్మిక ప్రదర్శ న, బహిరంగ సభ జరుగుతుందని ఆ యన పేర్కొన్నారు. తిరువూరు. మం డల బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నుం డి భవన నిర్మాణ కార్మికులు పెద్ద సం ఖ్యలో జిల్లా మహాసభకు తరలిరా వాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమం లో తిరువూరు మండల బిల్డింగ్‌ వర్క ర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు మీనుగు రామారావు, కామాల రామా రావు, నాయకులు పింగళి శ్రీనివాసరా వు, సిఐటియు మండల కార్యదర్శి బి. వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నా రు.