ఫొటో : రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎంఇఒ, తదితరులు
బిజ్జంపల్లిలో ఉపాధ్యాయ దినోత్సవం
ప్రజాశక్తి-ఉదయగిరి : జిల్లా ఉన్నత పాఠశాల బిజ్జంపల్లిలో మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎంఇఒ-2 తోట శ్రీనివాసులు పాల్గొని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి ఆయన గొప్పతనాన్ని చేసిన సేవలు సమానత్వం, క్రమశిక్షణ గొప్పతనాన్ని విద్యార్థులకు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి.వెంకటేశ్వర్లును స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో ఉత్తమ టీచర్ అవార్డు పొందిన ఎల్.బాబును సన్మానించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు టి వెంకటేశ్వర్లు, బండగానిపల్లి సర్పంచ్ లక్కు రవణమ్మ, పేరెంట్స్ కమిటీ చైర్మన్ సుందరరామిరెడ్డి, సీనియర్ ఉపాధ్యాయులు షేక్ నాయబ్ బాషా, ఉపాధ్యాయులు, స్కూల్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










